హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ex Minister: ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ఇప్పుడు మంత్రి నిర్ణయం కోసం ఎదురు చూపులు.. ఎవరా నేత..?

Ex Minister: ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ఇప్పుడు మంత్రి నిర్ణయం కోసం ఎదురు చూపులు.. ఎవరా నేత..?

సీటు కోసం మాజీ మంత్రి ఎదురు చూపులు

సీటు కోసం మాజీ మంత్రి ఎదురు చూపులు

Ex Minister: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒకప్పుడు తిరుగులేని నేత.. ఆయన ఏం చెబితే దానికి అదినేత కూడా ఊ కొట్టాల్సిందే..? అంతలా చక్రం తిప్పిన ఆయన.. మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపిని వదిలి వైసీపీలో చేరారు.. కానీ అనుకున్న ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ సారి కావాల్సిన సీటుకే గ్యారెంటీ లేదంటున్నారు.. దీంతో కేవలం ఆ మంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.. ఎవరా నేత.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Ex Minister: ఉత్తరాంధ్రలో అత్యంత గుర్తింపు ఉన్న నేతల్లో ఒకరు ఆయన.. ఒకప్పుడు మంత్రిగా పవర్ పాలిటిక్స్ అన్నీ ఆయన చుట్టూనే తిరిగేవి. ఆయన టీడీపీ (TDP) లో ఉన్నప్పుడు.. అధినేత సైతం ఆయన మాటను కాదనే వారు.. అయితే ఇదంతా గతం.. రాజకీయాల్లో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో.. అన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. ప్రస్తుతానికి అధికార వైసీపీ (YCP) లో ఉన్నారు..? రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కానీ తనకు కావాల్సిన సీటు వస్తుందా రాదా అని తేల్చుకోలేకపోతున్నారు. పాత వైభవం రావాలి అంటే ఒక్క చాన్స్ అంటూ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికైనా రాజకీయ వనవాసం వీడాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా అంటే మాత్రం అది సమాధానం లేని ప్రశ్నే.. మరి ఆయన గతాన్ని గుర్తించి అధిష్టానం అందలమెక్కిస్తుందా..? లేక చేసిన తప్పిదాలతో మళ్లీ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుందా అని చూడాలి.. అయితే ఆయనకు కావాల్సిన సీటు దక్కాలి అంటే.. ప్రస్తుతం అక్కడ ఉన్న మంత్రి.. వేరే స్థానానికి వెళ్తేనా అది సాధ్యవుతుంది..?

ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా.. ఆయనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabadra Rao). ఉమ్మడి విశాఖ జిల్లా (Visakha District) లో అనకాపల్లి (Anakapalli) రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే. హోరా హోరీ పోటీకి కేరాఫ్ అడ్రసైన ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్షనేతగా పని చేసిన అనుభవం వీరభద్రరావుది.

ఇదంతా గతమే ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కొన్నేళ్లుగా రాజకీయ గ్రహణం పట్టుకుంది. 2014లో విశాఖ పశ్చిమలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దాడి కుమారుడు రత్నాకర్. తన బలం, స్థాన బలం లేనిచోట చేసిన ఆ ప్రయోగం విఫలమై.. సీనియర్ నేత బలహీనత బయటపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా పోటీచేసే అవకాశం లభించలేదు. ఇంతలో అనకాపల్లిలో ఈక్వేషన్లు మారిపోయాయి. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఉన్నారు. అయితే ఇక్కడ మంత్రికి.. మాజీ మంత్రికి రాజకీయ వైరం ముదిరింది కూడా.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లే లక్ష్యం.. 8న భారీ ఎత్తున సభ.. మంత్రులు ఏం చెప్పనున్నారు అంటే?

దానికి తోడు పశ్చిమలో ఓటమి తర్వాత వైసీపీ అధినాయకత్వంతో విభేదించింది దాడి కుటుంబం. అందుకే 2019లో టికెట్‌ రాలేదని చెబుతారు. రాజకీయ కప్పదాటు వైఖరితో అనకాపల్లి సీటు వదులు కోవాల్సి వచ్చిందనే విమర్శలు దాడి కుటుంబం ఎదుర్కొంది. వైసీపీలో తిరిగి చేరినప్పుడే కుమారుడు రత్నాకర్‌కు రాజకీయ భవిష్యత్‌ కల్పించమని అధినాయకుడిని కోరారు.. అందుకు సమ్మతించిన హైకమాండ్ పార్టీ బాధ్యతలు తండ్రికి, పొలిటికల్ కెరీర్ రత్నాకర్‌కు కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సీఎం ఇచ్చిన హామీలో భాగంగా నామినేటెడ్ పోస్లులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయంగా తమస్థాయికి సరిపడవనే కారణాలతో వాటిని వదులుకుంది దాడి కుటుంబం.

ఇదీ చదవండి : మార్గశిర మాసంలో మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు.. విశిష్టత ఏంటంటే?

ఎమ్మెల్యే టికెట్‌ తప్ప.. మరే ఇతర పదవులు ఇచ్చినా తీసుకోకూడదనే ఆలోచనలో ఉన్న దాడి కుటుంబం.. మూడున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ నిర్ణయం ప్రత్యర్థి వర్గ నేత అయిన మంత్రి అమర్ నాథ్ కు కలిసొచ్చింది. అనకాపల్లిలో తన వర్గాన్ని కాపాడుకోవడం, వ్యూహాత్మకంగా పాచికలు వెయ్యడం తప్ప మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చే ఛాన్స్ దాడికి లేకుండా పోయింది. సీఎం పర్యటనలకు వచ్చినప్పుడో.. కీలక సమావేశాల నిర్వహించే సందర్భంలో తప్ప వీరభద్రరావు కానీ ఆయన తనయుడు కానీ చురుకుగా వ్యవహరించడం లేదు. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందనే గ్యారంటీ లేకపోవడంతో ఇప్పుడు వరకు సైలెంట్ గా ఉన్నారు.

ఇదీ చదవండి : కన్నీరు పెడుతున్న రైతన్న.. తడిసిపోతున్న అన్నదాత కష్టం

ఎందుకంటే సిట్టింగ్ సీటును.. అందునా మంత్రిని నియోజకవర్గం ఖాళీ చేయించి తమకు ఇస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే మరో ప్రచారం కూడా ఉంది.. మంత్రి అమర్ నాథ్ వచ్చే ఎన్నికల్లో.. వేరే స్థానంపై ఫోకస్ చేస్తున్నారని.. ఆయనకు అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని ఆయన అనుచరులు చెప్పేమాట.. ఈ అంశమే దాడి కుటుంబలో అశ పెంచుతోంది. ఎందుకంటే మంత్రి ఎక్కువగా యలమించిలిపైనే ఫోకస్ చేస్తున్నారు. అదే జరిగి ఆయన యలమంచిలికి సిఫ్ట్ అయితే అనకాపల్లి సీటు తమదే అన్నది దాడి ఫ్యామిలీ లెక్క.. మరోవైపు అనకాపల్లిలో వైసీపీ తిరిగి పట్టు సాధించాలంటే బలమైన గవర సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం.. కాపు ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నందున ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడం అనివార్యమనే వాదన వైసీపీలో ఉంది. టీడీపీ , జనసేన బలాలను, బలహీనతలను అంచనా వేశాక.. దాడి కుటుంబానికి ఛాన్స్‌ ఇస్తే సానుకూలంగా ఉండొచ్చనే వాదన ఉంది అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు