Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS CM JAGAN RAEDY TO GAVE 12 CRORE FOR ALL MLAS NGS

Bumper Offer to YCP MLAs: నేతల అసహనాన్ని సీఎం గుర్తించారా..? ఎమ్మెల్యేలకు జగన్ బంపర్ ఆఫర్

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

Bumper Offer to YCP MLAs: అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి అసహనంతో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం పలువురు ఎమ్మెల్యే బహిరంగంగానే తమ గొంతు వినిపించారు. సీఎం జగన్ అక్కడ కూర్చొని బటన్ నొక్కిత మా గ్రాఫ్ ఎలా పెరుగుతుందని.. కార్యకర్తలకు తాము ఏమీ చేయలేకపోతున్నామన్నది ఎక్కువమంది ఎమ్మెల్యే ఆవేదన.

ఇంకా చదవండి ...
    Bumper Offer to YCP MLAs: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీ నేతలు చాలామంది ఆగ్రహంతో ఉన్నారా..? ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapak Government) కార్యక్రమం కారణంగా ప్రజల్లో తమపై వ్యతిరేకత భారీగానే ఉందని గుర్తించారా..? దానికి ప్రధాన కారణం.. అధిష్టానమనే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు (AP Welfare Schemes ) అందిస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధాలు లేకుండా చేశారనే భావన ఉంది. వాలంటీర్లకు పబ్లిసిటీ వస్తోంది తప్పా.. అధికార పార్టీ ప్రతినిధులతో ప్రజలకు అవసరం లేకుండా పోయిందని.. ఇలాంటి సమయంలో తమ గ్రాఫ్ ఎలా పెంచుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ఏపీ ప్ర‌భుత్వం తాను త‌ల‌పెట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు చేరిన త‌ర్వాత వారి నుంచి ప్ర‌తిస్పంద‌న ఎలా ఉంటోంది? వారి అభిప్రాయం ఏమిటి? ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేయాల్సిన‌వి ఇంకేమైనా ఉన్నాయా? వారిలో అసంతృప్తి ఉంటే ఎలా నివారించాలి? త‌దిత‌ర విష‌యాల‌న్నింటిపై అవ‌గాహ‌న కోసం ''గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం'' పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంతో ఎమ్మెల్యేలకు.. పార్టీ పెద్దలకు ప్రజలు ఏమనుకుంటున్నారన విషయం తెలిసి.. జాగ్రత్తపడే అవకాశం వచ్చింది అంటున్నారు.

    గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్రమంలో భాగంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌జ‌లు స్థానిక ఎమ్మెల్యేల‌ను నిల‌దీయం ప్రారంభించారు. నిధుల కొర‌త‌తో ఇంత‌వ‌ర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌లేని ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల‌ను ఎలా స‌ముదాయించాలో అర్థం కాలేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే ఎదురు మాట్లాడినవారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే పరిస్థితి కనిపించింది. అయితే ఇలాంటి చర్యలు పార్టీపై తీవ్ర వ్య‌తిరేకత పెరిగలా చేసింది. 

    తాజా పరిస్థితులు సీఎం జ‌గ‌న్‌ను ఆలోచ‌న‌లో పడేసిందనే ప్రచారం ఉంది. ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ విష‌యాల‌పై సీరియ‌స్‌గా దృష్టిసారించారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగా అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీట నొక్క‌డం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నార‌ని, తాము మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు నిధులు లేక చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు.

    ఇదీ చదవండి : ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు ఫస్ట్ ప్లేస్.. ఎన్నికలకు రెండేళ్ల ముందే 7 గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీవీ.. వారు ఎవరంటే..?

    ఇలా అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అధినేతలో మార్పు తెచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఈనెల 6వ తేదీ నుంచి ఎమ్మెల్యేల‌తో స‌మావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆరోతేదీ నుంచి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 12 కోట్ల రూపాయల చొప్పున విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా ఎమ్మెల్యేల‌కు 2 కోట్ల రూపాయలు అంద‌జేస్తారు. అది వారి విచ‌క్ష‌ణ మేర‌కు ఉప‌యోగించుకునే అవకాశం కల్పిస్తారు. తరువాత 10 కోట్ల‌ను రెండు విడత‌లుగా అంద‌జేయ‌నున్నారు. అవ‌స‌రం అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌రికొంత సైతం అంద‌జేయ‌నున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు