హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Brother Anil: ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ఫిక్స్.. వెనుక ఉన్నది ఎవరు..? వైసీపీ సైలెంట్ వెనుక కారణం అదేనా?

Brother Anil: ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ఫిక్స్.. వెనుక ఉన్నది ఎవరు..? వైసీపీ సైలెంట్ వెనుక కారణం అదేనా?

వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ (ఫైల్)

వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ (ఫైల్)

Brother Anil New Party: బ్రదర్ అనిల్ ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యారా.. ఆయన వెనుక ఉన్నది ఎవరు..? వైసీపీ వ్యూహంలో భాగమా..? లేక సొంత అజెండాతో వస్తున్నారా..? బ్రదర్ అనిల్ పార్టీతో ఎవరికి లాభం..? నష్టం ఎవరికి..? రాజకీయ విశ్లేషకులు మాట ఏంటి..?

ఇంకా చదవండి ...

  Brother Anil New Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం తప్పదని విశ్లేషనలు వినిపిస్తున్నాయి. వరుస సమావేశాలతో బిజీగా ఉన్న బ్రదర్ అనిల్ (Brother Anil).. ఏపీలో పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యారా..? అయితే భార్య వైఎస్ షర్మిల (YS Sharmila) తో కలిసి పార్టీకి పని చేస్తారా..? ఆయనే క్రిష్టియన్, మైనార్టీ, బీసీ వర్గాలతో కలిసి పార్టీని నడిపిస్తారా..? అసలు ఆయన పార్టీ పెట్టడానికి కారణం ఏంటి.. వైసీపీ (YCP) గేమ్ ప్లాన్ లో భాగంగానే ఆయన పార్టీ పెడుతున్నారా..? లేక ఆయన వెను వేరే ఎవరైనా ఉండి.. జగన్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టిస్తున్నారా..? నిజంగా బ్రదర్ అనిల్ పార్టీ పెడితే.. అధికార పార్టీకి మైనస్సెంత..? ప్లస్ ఎంత..? బ్రదర్ అనిల్ పెడితే.. ప్రతిపక్షాలకు అనుకూలంగా మారుతున్నాం.. లేక నష్టం జరుగుతుందా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇదే.. అయితే ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా.. ఆయన మాత్రం పార్టీ పెట్టాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయ్యింది అంటున్నారు. అందులో భాగంగా ఆయన వరుస సమావేశాలని చెబుతున్నారు. మొదట మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunkumar) ను కలిసిన ఆయన.. అక్కడ పార్టీకి సంబంధి కొన్ని సలహాలు తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ తరువాతే వరుసగా క్రిస్టియన్, మైనార్టీ, బీసీ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని.. కేవలం సమావేశాలు నిర్వహించడమే కాదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తీరుపై విమర్శలు చేస్తున్నారు..

  ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. జగన్ కు వ్యతిరేక పార్టీలు అన్ని ఏకతాటిపైకి వస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అయితే పొత్తులకు సై అంటూ సంకేతాలు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సైతం ఆవిర్భావ సభలోనే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమని చెప్పేశారు. తాజాగా బీజేపీ కూడా టీడీపీ పొత్తకు సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. అందుకు సంబంధించి రూటు మ్యాప్ కూడా సిద్ధమైంది అంటున్నారు. అతి త్వరలోనే ఈ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమమంలో బ్రదర్ అనిల్ కుమార్ సైతం ఏపీలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అయితే బ్రదర్ అనిల్ పార్టీ పెట్టడంపై భిన్న వాధనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిగా.. ఇదంతా సీఎం జగనే చేయిస్తున్నారని.. ఆయన వ్యూహంలో భాగంగానే బ్రదర్ అనిల్ పార్టీ పేరుతో ముందుకు వస్తున్నట్టు సమాచారం.. ఇదంతా వ్యూహకర్త ప్రశాంత్ కిషర్ పొలిటికల్ గేమ్ అంటున్నారు. అందుకే బ్రదర్ అనిల్ విమర్శలపై వైసీపీ నేతలు స్పందించడం లేదంటున్నారు.

  ఇదీ చదవండి : వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేతలు.. సిద్దార్థ్-జశ్వంతిలు బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

  అయితే జగన్ న్ను తిడుతూ.. జగన్ పక్కాగా ఓటు బ్యాంకు అనుకున్న సంఘాలతో సమావేశం పెడితే.. జగన్ వ్యూహం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడా ఓ లెక్క ఉంది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాక్ చీలకుండా ఉండేందుకే టీడీపీ-జనసేన-బీజేపీలు ఒక్కతాటిపైకి వస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే.. అయితే ఈ ప్లాన్ కు చెక్ పెట్టడంలో భాగంగానే బ్రదర్ అనిల్ ను తెరపైకి తెచ్చారనే ప్రచారం ఒకటి ఉంది. బ్రదర్ అనిల్ సొంతగా పార్టీ పెడితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు కొంత చీలుతుందని.. బ్రదర్ అనిల్ తోనే తిట్టిస్తే.. అదంతా ప్రతిపక్షాల కుట్ర అని వారిపైకి తోసి సింపతి పొందుచ్చు అని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఇదీ చదవండి : వైసీపీ వాడుకొని వదిలేసిందా.. మంచు ఫ్యామిలీకి-సీఎం జగన్ కు మధ్య గ్యాప్ కు కారణం అదేనా..?

  అయితే మరో వాదన కూడా ఉంది ఇక్కడ. ప్రస్తుతం ఆయన నేరుగా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వర్గాలను దూరం చేసేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. వైసీపీ కోసం పని సంఘాలన్నింటినీ.. జగన్ క దూరం చేయడమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నారనే మరో ప్రచారం కూడా ఉంది. జగన్ కు వ్యతిరకంగా ఉన్న కొందరు.. కావాలనే బద్రర్ అనిల్ ను తెరపైకి తెచ్చారని.. ఆయన రాజకీయాల్లో వస్తే.. జగన్ ప్రస్తుతం పెద్ద బలంగా ఉన్న.. క్రిస్టియన్, మైనార్టీ.. బీసీ సంఘాల లఓట్లు కొన్ని చీలుతాయని.. అది తమకు ప్లస్ అవుతుందనే లెక్కలతోనే.. బ్రదర్ అనిల్ ను తెరపైకి తెచ్చరనే ప్రచారం కూడా ఉంది.

  ఇదీ చదవండి : ఏపీలో ట్రిపుల్ సెంచరీ కొట్టిన కోడి.. ధరలు పెరుగుదలకు కారణం అదే..

  అందులో భాగంగానే ఆయన విమర్శలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల సమయంలో బ్రదర్ అనిల్ తో సహా షర్మిల - విజయమ్మ అందరూ జగన్ గెలుపు కోసం పని చేసారు. ఇప్పుడు అదే అంశాన్ని తెర మీదకు తెస్తూ.. బ్రదర్ అనిల్ ఏపీలోనూ జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా.. పార్టీ ఏర్పాటు దిశగానే చర్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్రదర్ అనిల్ కు తెర వెనుక జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీల నేతల మద్దతు ఉందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకు వాదన వస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ycp, YS Sharmila

  ఉత్తమ కథలు