Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS BJP STATE PRESIDENT SOMU VEERRAJU CLARITY ON ALLIANCE WITH TDP NGS

BjP clarity on TDP: టీడీపీ -బీజేపీ పొత్తులపై క్లారిటీ.. పవన్ కోరిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోందన్న సోమువీర్రాజు

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

BjP clarity on TDP: సీఎం జగన్ ను గద్దె దింపాలనే సింగిల్ అజెండాతోనే విపక్షాలు వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయా.? అందులో భాగంగానే మళ్లీ కొత్త పొత్తులకు సిద్ధమవుతున్నాయి. టీడీపీ-జనసేనలు ఇప్పటికే పొత్తు విషయంలో క్లారిటీగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎక్కడ బయటడడం లేదు. పవన్ తో నే తమ జర్నీ అంటోంది.. మూడో పార్టీ గురించి ముచ్చట పెట్టడం లేదు. అయితే తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  BjP clarity on TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటికే అన్నీ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. అందులో భాగంగా అప్పుడు పొత్తులపై అన్ని పార్టీలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. పొత్తులకు సిద్ధం అంటే ఎప్పుడో క్లారిటి ఇచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  తో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశాన్ని అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బయట పెట్టారు. ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. లవ్ అన్నది వన్ సైడ్ కాదు.. టు సైడ్ ఉండాలి అంటూ.. తాను పవన్ తో పొత్తుకు సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చారు. అయితే అప్పుడు దానిపై స్పందించని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు.. పొత్తులకు సిద్ధం అంటూ టీడీపీని ఆశల పల్లకిలో పెట్టారు. అయితే దీనిపై బీజేపీ (BJP) రూట్ మ్యాప్ ఇవ్వాలి.. అంటూ మిత్రపక్షానికి డెడ్ లైన్ పెట్టేట్టు చేశారు. అంటే పవన్ సైతం టీడీపీ పొత్తుకు తాను సిద్దమే అని.. అలాగే బీజేపీ ని కూడా అందుకు ఒప్పిస్తాను అనే అర్థం వచ్చేలా చెప్పారు ఆయన.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుంది అన్న విషయం ఇక తేల్చాల్సింది బీజేపీ ఒక్కటే..

  తాజాగా పవన్ వ్యాఖ్యలపై జనసేన మిత్రపక్షం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన సభలో రెండు విషయాలు చెప్పారు. ఇందులో ఒకటి వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూస్తానని, దీనర్ధం టీడీపీ, బీజేపీలను తిరిగి దగ్గర చేస్తాననే విధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదన్నారు. ఇది కేవలం మీడియా అనుకుంటోందంటూ సోము వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా ఆయన టీడీపీతో పొత్తు ఉండదు అని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. గతంలో ఎప్పుడూ ఆయన ఈ విషయం గురించి ప్రస్తావిస్తే.. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని విరుచుకుపడే వారు.. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు..పొత్తు ఉండదని కనీసం ఖండించ లేదు.

  ఇదీ చదవండి : వంట నూనె ధరల కట్టడిపై ఫోకస్.. వ్యాపారులకు ప్రభుత్వం హెచ్చరిక

  అలాగే పవన్ కళ్యాణ్ జనసేన సభలో బీజేపీ నుంచి 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ కూడా కోరారు. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటోంది అనేది పవన్ ప్రశ్నించారు. దీనికి ఇంకా బీజేపీ నుంచి సమాధానం రాలేదు. దీనిపై మాట్లాడిన సోము వీర్రాజు 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందన్నారు. అంటే.. పవన్ కోరినట్లుగానే బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా దాదాపు ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ఎవరూ టీడీపీతో పొత్తు ఉండదు అనని చెప్పడం లేదు.. అంతే కాదు.. అందరూ తమ లక్ష్యం సీఎం జగన్ ను గద్దె దింపడమే అంటున్నారు. దానికి గురించి ఏం చేయాలో అన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో త్వరలో ఈ రోడ్ మ్యాప్ బయటికి వస్తే అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

  ఇదీ చదవండి : ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై చేతిలో డబ్బులు లేకున్నా.. పరసు మరచిపోయినా నో టెన్షన్.

  గతంతో పోల్చుకుంటే ఏపీ ప్రభుత్వంపై బీజేపీ దాడి పెరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఎలా విరుచుకుపడుతున్నారో.. ఇక్కడ కూడా బీజేపీ నేతలు అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధుల్ని సొంత అవసరాలకు వైసీపీ ప్రభుత్వం వాడేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. దీనిపై మరోసారి స్పందించిన సోము వీర్రాజు.. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని సోము ఆరోపించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు