Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS BJP LEADERS CHALLENGE TO YCP AND CM JAGAN NGS

BJP vs YCP: సీఎం జగన్ కు బీజేపీ సవాల్? దమ్ముంటే జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

BJP vs YCP: మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అన్నారు.. ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఉన్నట్టు ఉండి బీజేపీపై వైసీపీ మాటల దాడి పెంచింది. అదే స్థాయిలో బీజేపీ నేతలు సైతం సై అంటే సై అంటున్నారు. తాజాగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి.. సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India
  BJP vs YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి మెలసి ఉన్నట్టు కనిపించిన వైసీపీ (YCP) -బీజేపీ (BJP) మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పోలవరం పర్యటన ముందు వరకు.. కేంద్రపై కానీ.. బీజేపీ నేతలపై కానీ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసింది లేదు.. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. ప్రశ్నించిందే లేదు.. అడగక ముందే అన్ని విషయాల్లోనూ కేంద్రానికి మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. మొన్నటి రాష్ట్ర పతి, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు అంటే వైసీపీ మద్దతే కారణం.. కేవలం వైసీపీ అనే కాదు కేంద్రం సైతం రాజకీయంగా వైసీపీకి అండగా నిలుస్తూనే వచ్చింది. ఇలా చాలా సఖ్యంగా సాగుతున్న వారి ఫ్రెండ్ షిప్ (Friendship) కు ఇప్పుడు బ్రేకులు పడ్డాయా..? వైసీపీ, బీజేపీ మధ్య ఎందుకు దూరం పెరిగింది. ఓ వైపు తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. మోదీకి దగ్గర అవుతుంటే.. ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు గ్యాప్ పెంచుకుంటున్నారు అనే ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది.

  ఇటు ఏపీలో వైసీపీ నేతలు పదే పదే కేంద్రం తీరును తప్పు పడుతున్నారు. బీజేపీ నేతలను విమర్శిస్తున్నారు. అటు రాజ్యసభ వేదికగా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కేంద్రం తీరును నిరసిస్తున్నారు. అటు బీజేపీ నేతలు సైతం గతంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం (AP Government) పై విమర్శల దాడిని పెంచారు. టీడీపీపై విమర్శలు తగ్గించారు.  

  తాజాగా మాజీ మంత్రి.. ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ కు సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.

  ఇదీ చదవండి : కొడుకు కోసం కారు కొనడం నేరమా..? రోజా ఫైర్.. ఫ్లైట్ లో అభిమాని ప్రేమకు మంత్రి ఫిదా

  జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ప్రస్తుతం జమ్మల మడుగు నుంచి సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆదినారాయణ రెడ్డి సోదరుడు భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి జమ్మలమడుగు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఆ సంగతి అటు పెడితే తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ కు సవాల్ చేసారు.

  ఇదీ చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాదీవెన నగదు జమ ఎప్పుడంటే?

  అమరావతి రైతులు..అక్కడి ప్రజలతో పాటుగా తన వెంట్రుక కూడా వైఎస్ జగన్ పీకలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జమ్మలమడుగులో నిర్వహించిన బీజేపీ యువసంఘర్షణ స్కూటర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని.. చేతనైతే అక్కడ నుంచి పోటీ చేసి తనను ఓడించాలని సవాల్ చేసారు.

  ఇదీ చదవండి : శ్రీవారికి ఘనంగా పవిత్రోత్సవాలు.. ఎప్పటి నుంచి.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?

  రాష్ట్రానికి జగన్ దరిద్రం పోవాలని వ్యాఖ్యానించారు. తనకు వైఎస్ వివేకా రాజకీయ గురువుగా చెప్పుకొచ్చారు. ఆయన్ను చంపింది ఎవరో అందరికీ తెలుసని పేర్కొన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ను అధికారం నుంచి సాగనంపేందుకే తాము యాత్ర చేపట్టామని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు