Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS BJP DEMAND TO TDP WILL CM CANDIDATE GO WITH ALLIANCE NGS

CM Candidate Pawan: కూటమి సీఎం కేండిడేట్ గా పవన్.. టీడీపీతో పొత్తుకు కండిషన్లు.. బీజేపీ ప్లాన్ బీ ఏంటంటే?

మూడు పార్టీల పొత్తులు ఫిక్స్

మూడు పార్టీల పొత్తులు ఫిక్స్

CM Candidate Pawan: జనసేన అధినేత పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటింస్తారా..? అలా అయితేనే కూటమి అడుగులు ముందుకు పడతాయా..? మరి పవన్ మనసులో ఏం ఉంది.. అంత పెద్ద త్యాగానికి టీడీపీ సిద్ధమవుతుందా..? కుదరదంటు అంటే.. పొత్తు లేనట్టేనా..? అసలు బీజేపీ ప్లాన్ ఏ ఏంటి..? ప్లాన్ బీ ఏంటి..?

ఇంకా చదవండి ...
  CM Candidate Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ (YCP) అందరికంటే దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంతా జనం బాట పట్టారు.. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ.. సంక్షేమ పథాల ఫలితాలను తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా ఓటర్లకు తాయిలాలు కూడా ఇస్తున్నట్టు టాక్. మరోవైపు ఈ నెల చివరిలో ఎస్సీ, ఎస్సా, మైనార్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం (Srikakulam) నుంచి అనంతపురం (Anantapuram) వరుకు వీరి యాత్ర కొనసాగనుంది. సామాజిక న్యాయం పేరుతో వీరు ఆయా వర్గాల వారితో భేటీ అయ్యి.. మళ్లీ తమ ఓటు మాకే అని హామీ తీసుకోనున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam) సైతం జనాల్లో ఉండే ప్రయత్నాలు ప్రారంభించింది. అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పట్టారు. ఆయన సభలకు విశేష స్పందన వస్తుండడంతో.. ఇక నారా లోకేష్ (Nara Lokesh) సైతం ప్రజల బాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రైతు భరోసా పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇలా ఓ వైపు జనం జపం చేస్తునే.. మరోవైపు విపక్షాలు పొత్తులపై వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. బహిరంగంగా ప్రకటన చేయకపోయినా.. ఇంటర్నల్ గా దీనిపై ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది.

  సీఎం జగన్ పాలనపై భారీగానే వ్యతిరేకత కనిపిస్తున్నా.. ఆయనకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది.. కొన్ని వర్గాలు జగన్ ను వీడే అవకాశం లేదు. దీంతో అధికార వైసీపీని గద్దె దించాలి అంటే.. పొత్తులు తప్పని సరి అన్నది.. విపక్ష పార్టీల లెక్క.. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులకు సై అంటూ సిగ్నల్స్ ఇచ్చాయి. ఇక్కడో ఒక చిక్కు వచ్చింది. ప్రస్తుతం బీజేపీతో జనసేన కలిసి వెళ్తోంది. అంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ కూడా ఒప్పుకోవాలి లేదంటే.. బీజేపీని విడిచి టీడీపీతో వెళ్లాలి.. ఏపీలో బీజేపీతో పెద్దగా లాభం లేకపోయినా.. భవిష్యత్తు రాజకీయాలను బేరీజు వేసుకుంటే.. బీజేపీతో కలిసి వెళ్లడం మంచిది అనే ఆలోచనలో పవన్ ఉన్నారు. అందుకే టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీని ఒప్పించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : మహానాడుపై టీడీపీ ఫుల్ ఫోకస్.. తీర్మానాలపై ముమ్మర కసరత్తు.. ప్రధాన అజెండా ఏంటంటే?

  ఇక బీజేపీ విషయానికి వస్తే.. కేద్రంలోని పెద్దలతో వైసీపీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి వైసీపీతో ఏపీ బీజేపీ పోరాడుతోంది. జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కానీ వైసీపీని ఓడించడానికి టీడీపీతో కలిసి వెళ్లడం ఏపీ పాత బీజేపీ నేతలు ఎవరికి ఇష్టం ఉండందు. అంతేకాదు కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం చంద్రబాబుపై కోపంతోనే ఉన్నారు. ఎందుకంటే టీడీపీ ఇదివరకే ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకొని మోసం చేసి బయటకు వచ్చేసింది. మోదీ టార్గెట్ గా చంద్రబాబు జాతీయ స్థాయిలో హడావుడి చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని.. దేశమంతా తిరిగి చంద్రబాబు చేసిన హంగామాను బీజేపీ మరిచిపోలేదు. అందుకే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే.. ప్లాన్ ఏలో భాగంగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలి అన్నది బీజేపీ ఉద్దేశం.

  ఇదీ చదవండి : : డ్రైవర్ హత్యకేసు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. ఏ క్షణమైనా వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్‌..!

  కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడే ఏదైనా జరగొచ్చు. ఒకవేళ పవన్ ఒత్తిడి చేస్తే ఏం చేయాలన్న దానిపై కూడా బీజేపీ ప్లాన్ బిని బీజేపీ రెడీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వకుండా జనసేన+బీజేపీ సగం సీట్లు, టీడీపీ సగం సీట్లు తీసుకొని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అంగీకరిస్తేనే ఆ పార్టీతో వెళ్లాలని బీజేపీ షరతు పెట్టడానికి సిద్దమవుతున్నట్టు టాక్.

  ఇదీ చదవండి :అమ్మఒడి అమలుకు ఇన్ని కొర్రీలా..? అసలే 2 వేలు కోత.. మిగిలినదీ డౌటే..? స్కూళ్లకు క్యూ కడుతున్న తల్లులు

  ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. అయితే అందుకు టీడీపీ ఒప్పుకోవడం కష్టమే.. ఇప్పటికే పొత్తుల విషయం చంద్రబాబు ఓ అడుగు వెనక్కు వేశారు. తానే పొత్తులకు పిలుపు ఇస్తే భారీగా త్యాగాలు చేయాల్సి వస్తుందని అనుమానిస్తున్నారు. అందుకే పరిస్థితి చూసి ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక సీఎం సీటు ఇవ్వాలని షరతు పెడితే.. చంద్రబాబు పొత్తుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. సగం సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉండదు.. దీంతో పొత్తుకు బ్రేకులు పడతాయని.. పవన్ సైతం ఏమీ మాట్లాడడానికి ఉండదు అనేది బీజేపీ ప్లాన్..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Janasena, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు