Chanrabbabu-Jr NTR: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ది విడదీయలేని బంధం.. ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేపడతారన్నది చాలామంది నమ్మకం.. ప్రస్తుతానికి తారక్ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయనప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఆ డిమాండ్ ఉంది. జూనియర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని కొందరు.. పార్టీలోకి నేరుగా రావాలని చాలామంది డిమాండ్ చేస్తుంటారు. టీడీపీ నేతలు సైతం చంద్రబాబు నాయుడు ముందే తారక్ ను పార్టీలోకి తీసుకురావాలని ప్రతిపాదన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా.. సైలెంట్ గా సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. దీంతో జూనియర్ ను పార్టీలోకి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు సైతం చంద్రబాబు తీరు నచ్చడం లేదని.. ఇలా పలు రకాల ప్రచారాలు ఉన్నాయి. తాజాగా చంద్రబాబు చేసిన ట్వీట్ సైతం ఇఫ్పుడు మరో వివాదానికి దారి తీసింది.
తాజాగా RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై టీటీడీ అధినేత చంద్రబాబు అభినందించారు.
Delighted to learn that @RRRMovie has won the #GoldenGlobes Award for Best Original Song! Congratulations to @mmkeeravaani, @ssrajamouli and the entire team! Absolutely proud! Like I said earlier, Telugu has now become the language of Indian soft power.#NaatuNaatu #RRRMovie pic.twitter.com/ZpIQ7TbI5K
— N Chandrababu Naidu (@ncbn) January 11, 2023
‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు రావడంతో కీరవాణి, రాజమౌళి , RRR టీమ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అటు చంద్రబాబు ట్వీట్ కు జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘థాంక్యూ సోమచ్ మామయ్య’ అంటూ అప్యాయంగా బదులిచ్చారు. అందర్నీ సార్ అని సంబొధించే ఎన్టీఆర్.. వరుస ప్రకారం మామాయ్య అనే బధులిస్తూ.. ఆప్యాయత ప్రదర్శించారు..
Thank you so much mavayya.
— Jr NTR (@tarak9999) January 11, 2023
ఎన్టీఆర్ గౌరవంగానే సంబోధించినా.. చంద్రబాబు తీరుపై తారక్ అభిమానులు మండిపడుతున్నారు. అందుకు కారణం ఏంటంటే... చంద్రబాబు చేసిన ట్వీటే.. ఎందుకంటే కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ ను మెన్షన్ చేస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూ.ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ఇదొక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డును RRR సినిమాలో జూ.ఎన్టీఆర్ ముఖ్యమైన పాత్ర పోషించారు కాబట్టి అతని పేరు ప్రస్తావించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగానే హర్ట్ అయ్యారు.. చంద్రబాబు తీరును తప్పు పడుతూ ట్వీట్లు చేస్తున్నారు.
నరేంద్ర మోడీ లాంటి వారే Jr NTR పేరు మెన్షన్ చేశారు. మీ స్వార్థపు రాజకీయాలకి ఇంక స్వస్తి చెప్పరా చంద్రబాబు గారు ????
— Simha NTR (@SimhaNTR4) January 11, 2023
అయితే చంద్రబాబు జూ.ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పనప్పటికీ జూ.ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబుకు థాంక్యూ చెప్పడం ఎలా ఉందో చూశారా అంటూ తారక్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు చేసిన ట్విట్ ఇటు సిని ఇండస్ట్రీతోపాటు పొలిటికల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది. జూ.ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యుడే, టీడీపీకి ఆయనెప్పుడు సపోర్ట్ గా ఉంటారని చెబుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్న ఈ సమయంలోనైనా జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించ లేదంటే ఇది కావాలనే చేసినట్లుందని పలువురు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Jr ntr, Rrr film