హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఒక్క ఛాన్స్.. సెకెండ్ ఛాన్స్.. లాస్ట్ ఛాన్స్.. మీ ఓటు ఎవరికి..? 2024 ఎన్నికల నినాదం ఇదే

AP Politics: ఒక్క ఛాన్స్.. సెకెండ్ ఛాన్స్.. లాస్ట్ ఛాన్స్.. మీ ఓటు ఎవరికి..? 2024 ఎన్నికల నినాదం ఇదే

మూడు పార్టీల నినాదా ఇదే

మూడు పార్టీల నినాదా ఇదే

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మూడు కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏ నినాదంతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలకు  కేవలం 16 నెలల సమయమే ఉంది అంటున్నారని సీఎం జగన్  మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా ముందే.. అంటే 2023 చివరిలో లేదా 2024 ఆరంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే  అధికార వైసీపీ (YCP).. గడప గడప ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu).. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పడుతున్నారు. ఇక నారా లోకేష్ (Nara Lokesh) జనవరి 27 నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) సైతం.. బస్సు యాత్రకు సై అంటున్నారు. ఇలా ప్రస్తుతం రాజకీయం రసవత్తరంగా మారింది.

సాధారణంగా ఏ పార్టీ అయినా ప్రజల్లోకి ప్రచారం కోసం వెళ్లే ముందు ఒక నినాదం  ఎత్తుకుంటుంది.. ఆ నినాదమే గెలుపుకు బాటలు వేస్తుంది. గత ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి.. పిలుపు ఇచ్చిన ఒక్క ఛాన్స్ నినాదం.. ప్రభంజనంగా మారింది.. ఇప్పుడు సీఎం జగన్ అవ్వడంలో ఆ ఒక్క ఛాన్స్ నినాదానిదే కీలక పాత్ర. ఈ విషయం చాలామంది వైసీీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు.

మరి 2024 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నినాదం ఏంటి... ఏ పిలుపుతో ప్రచారానికి వెళ్తున్నారు అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ముందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి  సెకెండ్ ఛాన్స్ పేరుతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతే కాదు వై నాట్ 175 నినాదాన్ని కూడా గట్టిగానే వినిపిన్నారు. అంటే రెండో సారి 175 సీట్లలో గెలిపించండి.. 30 సువర్ణ పరిపాలన అందిస్తాం అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఈ సెకెండ్ ఛాన్స్ ను ప్రజలు ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి.

ఇదీ చదవండి : కూతురు సినీ ఎంట్రీపై రోజా క్లారిటీ.. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని శ్రీవారిని మొక్కుకున్న మంత్రి

ఇక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇదే లాస్ట్ ఛాన్స్ అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. తాజాగా కర్నూలు జిల్లాలో ని రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తనను గెలిపించి.. సీఎం చేస్తేనే మళ్లీ అసెంబ్లీకి వెళ్తానని శపథం చేశానని..  సో ఈ సారి మీరు ఓట్లు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతా.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు అని ప్రజలకు పిలుపు   ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడి చివరి ఛాన్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఇదీ చదవండి: ఏపీలో మొలకెత్తిన విత్తనాలకు పెరిగిన డిమాండ్? ఇలా తింటేనే బరువు తగ్గుతారని తెలుసా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. జగన్ ను ఫాలో అవుతున్నారు. చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు.. జగన్ కు అవకాశం ఇచ్చారు. వారి పాలన ఎలా ఉందో చూశారు. ఇప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ పిలుపు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మూడు నినాదాల్లో మీ ఓటు ఎవరికి..?

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan

ఉత్తమ కథలు