Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS ACTOR VANI VISWANATH READY TO CONTEST AT NAGARI AGAINST ROJA NGS

Nagari Politics: నగరిలో అందరి చూపు ఆమెపైనే.. తమ పార్టీ తరపున పోటీ చేయాలని ఆహ్వానం.. ఆమెకు ఓకేనా..?

నగరిలో గ్లామర్ ఫైట్

నగరిలో గ్లామర్ ఫైట్

Nagari Politics: ఆంధ్రప్రదేశ్ లోని నగరి రాజకీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గ్లామర్ మరింత రెట్టింపు కానుంది. ఇప్పటికే వైసీపీ నుంచి రోజా అక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి గెలిచి తీన్మార్ ఆడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలు సైతం ఆ సీటుపై గట్టిగానే ఫోకస్ చేశాయి.. దానికి కోసం ఏం చేస్తున్నాయో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Nagari Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా.. అదే నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు.. ఇప్పటికే అక్కడ నుంచి ఆమె రెండు సార్లు గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి.. గెలుపొందేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్నా.. ప్రస్తుతానికి ఆమెకు ఉన్న క్రేజ్ ప్రకారం మరోసారి అధినేత జగన్ సిట్టింగ్ సీటు ఆమెకే కట్టబెట్టే అవకాశం ఉంది. విపక్షాలు సైతం ఈ సీటుపై కన్నేశాయి. ముఖ్యంగా రోజాను ఓడించాలని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరి రోజాను ఢీ కొట్టే అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని ఒప్పటి అందాల నటి వాణి విశ్వనాథ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం టీడీపీతోనే ఉన్నారు. నగరి నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు వాణి విశ్వనాథ్. కానీ టీడీపీ ఆమెకు సీటు కేటాయించేది అనుమానమే.. అందుకే ఆమె.. కచ్చితంగా నగరి నుంచి పోటీ చేస్తానని.. టీడీపీ సీటు ఇవ్వకపోతే స్వతంత్య్రంగా పోటీ చేసేందుకైనా సిద్ధం అని అమె స్పష్టం చేసింది. అంటే వేరే పార్టీ నుంచి అయినా పోటీ చేయడానికి ఆమె సిద్ధపడినట్టే కనిపిస్తోంది. టీడీపీ అధినేతను ఒక్కసారి అడిగి.. ఆయన కాదు అంటే.. బీజేపీ లేదా జనసేన వైపు అడుగులు వేయొచ్చన్న టాక్‌ వినిపిస్తోంది.

  ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుందని స్పష్టత రాకపోయినా.. పుత్తూరులో జనసేన సైనికులు అప్పుడు హడావుడి మొదలెట్టారు. జనసేన లో చేరి.. నగరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలంటూ వాణి విశ్వనాథ్ బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాణి విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు. జనసేన ఆఫర్ ఎలా ఉన్నా.. నగరి నుంచి బరిలోకి దిగేందుకు ఆమె మాత్రం.. ప్లానింగ్ మొదలు పెట్టారు. సరిగ్గా రెండు వారాల కిందట నగరి వచ్చిన ఆమె.. తమిళ, తెలుగు సినిమా రంగంతో పరిచయం ఉన్నవారిని కలిసింది. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు చేసి.. ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
  గతంలో నర్సుగా తన అమ్మమ్మ నగరిలోనే పనిచేశారని చెబుతున్నారు వాణీ విశ్వనాథ్‌. ఆ అనుబంధంతో తానూ నగరి ప్రజలకు మరింత దగ్గరవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1990ల్లో ఆమె తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎంత వరకు రాణిస్తారో చూడాలి.. అది కూడా అదే ఇండస్ట్రీకి చెందిన రోజాపై పోటీ అంటే అంత ఈజీ కాదు.. 2019 ఎన్నికలకు ముందు సీఎం చంద్ర బాబును పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ఆ పార్టీలో చేరాలనుకుంది. మూడు సార్లు అమరావతికి కూడా వెళ్లినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఈసారి ఏ పార్టీ నుంచి అవకాశం లేకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగాలని భావిస్తోన్నారట. అయితే జనసైనికులు ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పుడు నగరి పాలిటిక్స్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MLA Roja, Nagari MLA Roja

  తదుపరి వార్తలు