Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL FIGHTS TDP DEMAND TO CM JAGAN RESIGNATION FOR PHONE TAPPING ISSUE NGS

Phone Tapping: సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్? ఏపీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

Phone Tapping: ఏపీలో విపక్ష నేతల ఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయా..? ఏఏ నేతలు ట్యాపింగ్ లో ఉన్నారు..? ఎప్పటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోంది..? ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు..? విపక్షాల వాదన ఏంటి.. ట్యాపింగ్ చేస్తే సీఎం రాజీనామా చేయాలా..?

ఇంకా చదవండి ...
    Phone Tapping: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపస్తోంది. దానికి తోడు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ (Ex Minster Narayna) అరెస్ట్ ఆ దుమారాన్ని మరింత పెంచుతోంది. నారాయణ అరెస్ట్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. మరోసారి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireedy Ramachandra Reddy) చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నారాయణ అరెస్ట్ విషయంలో మాట్లాడినప్పుడు.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అదుపులోకి తీసుకోగలిగామనడంతో.. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ (TDP) అభ్యంతరం తెలిపింది. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramayya) మండిపడ్డారు. తాజాగా పెద్ది రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు.

    ప్రత్యర్థులపై కేవలం రాజకీయంగా కక్ష సాధించడానికే జగన్ ప్రభుత్వం.. టెలిఫోన్ ట్యాపింగ్ ను ప్రయోగిస్తోందని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల తన పాలనలో జగన్ ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం విషయాన్ని టీడీపీ అంత త్వరగా వదలదు అన్నారు. తమ అధినేత ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానాలకు తమకు ఉన్నాయి అన్నారు. తక్షణమే పూర్తి వాస్తవాలతో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ ముఖ్యనేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో సీఎం బయట పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని ఆయన కోరారు.

    ఇదీ చదవండి : ఒకే ఫ్రేమ్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్.. ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అంటే?

    ఫోన్ ట్యాపింగ్ కు నైతికబాధ్యత వహిస్తూ సీఎం జగన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్ పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలను డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ కి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని, దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఎక్కువగా లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని పెద్ది రెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు