హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Political Crime: పల్నాడులో రక్త చరిత్ర.. టీడీపీ నేత పై గొడ్డళ్లతో దాడి.. వైసీపీ గుండాల పనే అంటూ చంద్రబాబు ఫైర్

Political Crime: పల్నాడులో రక్త చరిత్ర.. టీడీపీ నేత పై గొడ్డళ్లతో దాడి.. వైసీపీ గుండాల పనే అంటూ చంద్రబాబు ఫైర్

టీడీపీ నేతలపై గొడ్డళ్లతో దాడి

టీడీపీ నేతలపై గొడ్డళ్లతో దాడి

Political Crime: ఆంధ్రప్రదేశ్ లో రక్త చరిత్ర ఆగడం లేదు. నిత్య ఎక్కడో ఒక చోటు హత్యలు.. హత్యాయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలే టార్గెట్ గా రెచ్చిపోతున్న మాఫియా పెరిగిపోతోంది. తాజాగా పల్నాడులో టీడీపీ నేతపై గొడ్డళ్లతో దుండగులు దాడి చేయడం కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

  Political Crime: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ రక్తచరిత్ర ఆగడం లేదు. పల్నాడు జిల్లా (Palnadu District) రొంపిచర్ల మండలం చిట్టిపోతునివారిపాలెం దగ్గర టీడీపీ (TDP) మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Venna balakoti Reddy) పై హత్యాయత్నం జరిగింది. ఉదయం నడకకు వెళ్ళినప్పుడు గొడ్డల్లతో దాడి చేసిన దుండగులు.. వెన్న బాలకొటిరెడ్డి చనిపోయాడని వదలివెల్లినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెన్న బాలకోటి రెడ్డిని గుర్తించిన ఆయన బంధువులు హుటాహుటిన నరసరావుపేట (Narasaraopeta) ఆసుపత్రికి తరలించారు. వెన్న బాలకోటిరెడ్డి మాజీ రొంపిచర్ల అధ్యక్షుడు గా పనిచేశారు.. ఆయనపై దాడి చేసింది ఎవరు? దాడికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలే అని ఆరోపిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఈ దాడిలో వైసీపీ ఎంపీపీ భర్తే పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హత్యకు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  అయితే సీఎం జగన్ (CM Jagan) ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్వీట్.. చేశారు. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహించారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.

  తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని.. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ ఆదేశాలిచ్చారా? అని నిలదీశారు. లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని.. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని నిప్పులు చెరిగారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న బాలా కోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. 

  హ‌త్య‌లు, దాడుల‌తో టిడిపి కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ రెడ్డి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం మీరు చేయిస్తోన్న‌ హ‌త్య‌లు, దాడులే మీ ప‌త‌నానికి దారులు అని గుర్తు చేశారు. రొంపిచ‌ర్ల మండ‌ల టిడిపి అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల ప‌నే. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైసీపీ స‌ర్కారుదే బాధ్య‌త అని డిమాండ్ చేశారు .‌. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే.. మీ రౌడీమూక‌లు ఎంత‌గా బ‌రితెగించాయో అర్థం అవుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

  ఫ్యాక్ష‌న్‌ మ‌న‌స్త‌త్వం బ్ల‌డ్‌లోనే వున్న మీ పాల‌న‌లో ప‌ల్నాడు ప్రాంతం ర‌క్త‌సిక్త‌మ‌వుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక‌నైనా హ‌త్యా రాజ‌కీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. జగ‌న్‌రెడ్డి అధికారం, పోలీసులు అండ‌గా వున్నార‌ని రెచ్చిపోతున్న వైసీపీ నేత‌లకి ఇదే చివ‌రి హెచ్చ‌రిక అంటూ టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

  ఉత్తమ కథలు