ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే జిల్లాల్లో నంద్యాల ఒకటి. భూమా ఫ్యామిలీ చుట్టూ తిరిగే రాజకీయాలు వేడిని రగిలిస్తూనే ఉంటాయి. తాజాగా ఆళ్లగడ్డలో.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కారణంగా ఆళ్లగడ్డలో.. ఉద్రిక్త పరిస్థితి ఉంది.
పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. తనతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పారవికి అఖిలప్రియ సవాల్ విసిరారు. ఐతే... ప్రస్తుతం ఆళ్లగడ్డలో 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో... ఈ సవాళ్లు, బహిరంగ చర్చలు కుదరవని పోలీసులు తెలిపారు. అందుకు అఖిలప్రియ ఒప్పుకోకపోవడంతో... ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
పోలీసుల చర్యతో... ఇవాళ గాంధీ చౌక్ దగ్గర బహిరంగ చర్చ జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిలప్రియ మద్దతుదారులు.. పోలీసుల తీరుపై గుర్రుగా ఉన్నారు. పోలీసులు అఖిల ప్రియ ఇంటి దగ్గర భారీగా మోహరించడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics