హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ex Central Minister: ఆ మాజీ మంత్రి రూటు మార్చారా..? ఆ వ్యూహంతో వైసీపీలో మొదలైన టెన్షన్

Ex Central Minister: ఆ మాజీ మంత్రి రూటు మార్చారా..? ఆ వ్యూహంతో వైసీపీలో మొదలైన టెన్షన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Ex Central Minister: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.. వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో నేతలంతా గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఆ మాజీ కేంద్ర మంత్రి వ్యూహం మార్చడంతో.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

Ex Central Minister: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్నదానిపై క్లారిటీ రానప్పటికీ.. అన్ని పార్టీల్లో మాత్రం ఎన్నికల వేడి కనిపిస్తోంది. గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి  రాజు (Asokh Gajapati Raju) రూటు మార్చేశారని ప్రచారం మొదలైంది. విజయనగరం (Vizianagaram) రాజకీయాల్లో ఆసక్తికరమేనా? ఏ విషయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabadra Swamy) కలవర పడుతున్నారు? అశోక్ గజపతి రాజు వ్యూహం మారిస్తే.. వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి అనుకుంటున్నారా..?

విజయనగరం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు హాట్ హాట్ గా

నడుస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఆయన కుమార్తె కోలగట్ల శ్రావణి విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. నియోజవర్గంలో కోలగట్ల ఫామిలీదే శాసనం. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కోలగట్ల సత్తా చాటారు. ఇప్పుడు విజయనగరంలో ఏం జరగాలి అనా..? కోలగట్ల ఊ కొట్టాల్సిందే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకు ఎదురే ఉండబోదని కోలగట్ల లెక్కలేసుకుంటున్న తరుణంలో టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ కలవర పెడుతోంది.

గత ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమెపై స్వల్ప ఆధిక్యంతో గెలిచారు కోలగట్ల. వచ్చే ఎన్నికల్లోనూ అదితి గజపతిరాజే టీడీపీ నుంచి బరిలో ఉంటారని ఇన్నాళ్లూ ఎమ్మెల్యే భావించారట. అయితే అనూహ్యంగా ఈ దఫా అసెంబ్లీ బరిలో అశోక్‌గజపతిరాజే పోటీ చేస్తారని టీడీపీలో చర్చ సాగుతోంది. ఆ మాట ఎమ్మెల్యే చెవిలో పడటంతో అలర్ట్‌ అవుతున్నారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఎడ్లబండిని భుజాన మోసిన నారా లోకేష్ .. కాడెద్దులా మారడానికి కారణం అదే

ఎందుకంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో కావడంతో.. ఛాన్స్‌ తీసుకోవడానికి ఇష్ట పడటం లేదు. బలమైన నేతలను అసెంబ్లీ బరిలో దించాలని యోచిస్తోందట. దీంతో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా.. విజయనగరంలో అశోక్‌గజపతిరాజును అసెంబ్లీకి పోటీ చేయిస్తారని సమాచారం. అశోక్‌ గజపతిరాజు కొంత కాలంగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యేగా.. మంత్రిగానూ ఉన్నారు. టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో ఏమో.. కొద్ది రోజులుగా విజయనగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అశోక్‌ గజపతిరాజు.

ఇదీ చదవండి: కోన రఘుపతి ప్లేస్ లో కోలగట్ల వీరభద్ర స్వామి.. స్పీకర్, డిప్యూటీ ఇద్దరూ ఉత్తరాంధ్ర నేతలే.. కారణం ఇదే

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. బాదుడే బాదుడు కార్యక్రమాలు,

పార్టీ సమావేశాలతో టీడీపీ కేడర్‌ను ఉత్సాహ పరుస్తున్నారట. ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉంటే.. లోక్‌సభ పరిధిలోని మొత్తం అసెంబ్లీ

నియోజకవర్గాల్లో పర్యటించాలి. కానీ.. విజయనగరం అసెంబ్లీ పరిధిలోనే రాజుగారు తిరగడం చూశాక వైసీపీ శిబిరంలో చర్చ మొదలైందట.

ఇదీ చదవండి : సర్పంచ్ గా గెలవండి.. సినిమా డైలాగులు కాదు సీఎంతో పోటీ అంటే.. పవన్ కు మంత్రి రోజా కౌంటర్లు

మాన్సాస్‌ ట్రస్ట్‌ గొడవ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు అశోక్‌గజపతిరాజు. ఆ ఎపిసోడ్‌పై విజయనగరంలో గట్టి

చర్చే జరిగింది. పైగా నియోజకవర్గంపై ఆయనకు పట్టు ఉంది. అందుకే అశోక్‌గజపతిరాజు పోటీ చేస్తే సమీకరణాలు మారతాయని ఎమ్మెల్యే

కోలగట్ల లెక్కలేస్తున్నారట. అశోక్‌ పోటీ చేస్తే.. ఇదే తనకు చివరి పదవి అని సన్నిహితుల దగ్గర కామెంట్స్‌ చేస్తున్నారట ఎమ్మెల్యే.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Vizianagaram, Ycp

ఉత్తమ కథలు