AP New CS: ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ నూతన కార్యదర్శిగా కె.ఎస్. జవహార్ రెడ్డి (KS Jawahar Reddy) డిసెంబర్ 1వ తేదీ నుంచే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన చేశారు.. కీలక అధికారులకు స్థాన చలనం చేశారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ భారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలు ఏడాదిన్నర లోపే ఉండే అవకాశం ఉండడంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా భాగంగా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సుదీర్ఘ కసరత్తు తరువాత.. జవహర్ రెడ్డికి ఓటేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి..
ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మమరో రెండు రోజుల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన ప్లేస్‌లో ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీలో ఉన్నా ప్రస్తుతం సీఎంకి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపారని తెలుస్తోంది.
ఇది చదవండి: రైతులకు అదిరిపోయే శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి 200 కోట్లు జమ..!
ఇప్పటికే నియామకం పూర్తైందని సమాచారం.. డిసెంబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది.
ఇది చదవండి: నేటితో ముగుస్తున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. ఆదివారం అశ్వవాహనంపై అమ్మవారి దర్శనం..
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పుడు సీఎంకు స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు.
అయితే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ.. పేరు కూడా ప్రధానంగా వినిపించిది. వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ఐఏఎస్ అధికారి తదుపరి సీఎస్ రేసులో ముందున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని చివరికి జైలుకు కూడా వెళ్లారు. ఆ కేసుల నుంచి క్లీన్ చిట్ రావడంతో ఆయను నియమిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ మాత్రం.. ఎన్నికల నేపథ్యంలో జవహర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News