హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Elections: నవంబర్ లోనే ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?

AP Elections: నవంబర్ లోనే ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?

ఏపీలో ముందస్తు ఎన్నికలు (File Image)

ఏపీలో ముందస్తు ఎన్నికలు (File Image)

AP Elections: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు తప్పవా..? ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత సీఎం జగన్ దీనిపై ప్రకటన చేయనున్నారు. అసలు జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లింది అందుకేనా..? ఈ ప్రచారంలో వాస్తవం ఎంత..?

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

AP Elections:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) భావిస్తున్నారా..? ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత దీనిపై ప్రకటన రావొచ్చా..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో (AP Politics) జరుగుతున్న ప్రచారం ఇదే.. ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లిన సీఎం జ‌గ‌న్‌.. ఇదే విష‌యంపై ప్రధాని మోదీ (Prime Minister)తో చర్చిస్తారని వైసీపీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా (Amit saha) లతో భేటీలో ఇదే అంశంపై మాట్లాడే అంశం ఉండొచ్చు అంటున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి తెలంగాణ‌ (Telangana)లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇవి రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ‌తో పాటు.. ఏపీలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది.

సీఎం జ‌గ‌న్‌కు, కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంపై మోదీని ఒప్పించాల‌నేది సీఎం జ‌గ‌న్ ప్లాన్‌.. అందుకే ఆయ‌న హ‌ఠాత్తుగా.. ఢిల్లీకి వెళ్లారన్నది వైసీపీ వర్గాల టాక్. సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందంగా ఉన్నారని జగన్ భావిస్తున్నా.. ముందస్తు ఎన్నికలు కోరుకోవడానికి చాలాకారణాలే ఉన్నాయి అంటున్నారు.

సీఎం జ‌గ‌న్‌కు, కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంపై మోదీని ఒప్పించాల‌నేది సీఎం జ‌గ‌న్ ప్లాన్‌.. అందుకే ఆయ‌న హ‌ఠాత్తుగా.. ఢిల్లీకి వెళ్లారన్నది వైసీపీ వర్గాల టాక్. సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందంగా ఉన్నారని జగన్ భావిస్తున్నా.. ముందస్తు ఎన్నికలు కోరుకోవడానికి చాలాకారణాలే ఉన్నాయి అంటున్నారు.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి జగన్ టికెట్ ఇవ్వరా? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అయితే ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య వెంటాడుతోంది. కేంద్రం నుంచి నిధుల రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం కూడా కష్టమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా పథకం నిలిచిపోయానా.. కాస్త వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం ఉంది. ఈ కష్టాలు అవసరం లేదు అనుకుంటే..? ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అని సీఎం జగన్ అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతోంది. అమ‌ల‌వుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు న‌నిలిచిపోక ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది జ‌గ‌న్ ప్లాన్‌గా ఉంద‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది.

ఇదీ చదవండి : అమ్మో నిమ్మ.. ఒక్క కాయ ధర ఎంతో తెలిస్తే షాక్.. అదే రూటులో అల్లం.

దీనికి తోడు ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామని వైసీపీ లెక్కలు వేసుకుంది. కానీ అనూహ్యంగా పోటీలోనే లేదు అనుకున్న తెలుగు దేశం పార్టీ మూడింటికి మూడు స్థానాల్లో గెలుపొందింది. అంటే యువత.. చదుకున్న వారిలో జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని వైసీపీ వర్గాలకు లెక్కలు వేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లలో కూడా వ్యతిరేకత మొదలైతే మొదటికే ప్రమాదం వస్తుంది. అందుకే ముందస్తుకు వెళ్లడమే మేలనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నాయని.. అదే విషయంపై ప్రధానితో పాటు, అమిత్ షాతో చర్చిస్తారనే ప్రచారం ఉంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం.. అలాంటి చర్చ ఏమీ లేదని అంటున్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఏపీకి రావాలిసిన బకాయి నిధులు..  ఇతర ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నాయి..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Pm modi

ఉత్తమ కథలు