హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Minsters: దళిత మహిళకు హోం శాఖ.. డిప్యూటీగా రాజన్నదొర.. ఫైనల్ లిస్ట్ ఇదే

AP New Minsters: దళిత మహిళకు హోం శాఖ.. డిప్యూటీగా రాజన్నదొర.. ఫైనల్ లిస్ట్ ఇదే

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..?

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..?

AP New Minsters Portfolios: రెండో కేబినెట్ కూర్పులోనూ సీఎం జగన్ మరోసారి తన మార్క్ చూపించారు.. వరుసగా రెండో సారి ఐదుగురు డిప్యూటీ సీఎంలకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే ముందునుంచి చెబుతున్నట్టే దళిత మహిళకు హోం మంత్రి పదవికి అవకాశం కల్పించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే., ఫైనల్ లిస్ట్ ఇదే.?

ఇంకా చదవండి ...

Anna Raghu, Amaravathi , News18.

AP New Minsters Portfolios:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మరోసారి కేబినెట్ కూర్పులో తనదైన మార్కు చూపించారు.. బడుగు బలహీన వర్గాలకు అధికంగా ప్రధాన్యం ఇచ్చారు.. అలాగే శాఖల కేటాయింపులోనూ సామాజిక సమికరణలు పాటించారు. తొలి కేబినెట్ లో లాగే రెండో కేబినెట్ లోనూ ఐదుగురుకి డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇచ్చారు.  గతంలో మహిళను డిప్యూటీ సీఎంలుగా కొనసాగించిన సీఎం జగన్.. ఈ సారి అలాంటి ప్రయత్నం చేయలేదు. ఐదు సామాజిక వర్గాలను మాత్రమే ప్రమాణికంగా తీసుకున్నారు. కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ (Kottu Satynnarayana) కు, ఎస్సీల్లో నారాయణ స్వామి (Narayna Swamy) కి, బీసీల్లో ముత్యాల నాయుడు (Muthyala Naidu)కు, మైనారిటీల నుంచి అంజాద్ బాషా (Amzad bhasha)కు, ఎస్టీల నుంచి రాజన్న దొర (Rajanna Dhora)కు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే గతంలో హామీ ఇచ్చినట్టే దళిత మహిళకు హోం మంత్రి పదవిని కేటాయించారు.. రెండోసారి మంత్రిగా కొనసాగుతున్న తానేటి వనిత (Taneti Vanitha) ఇకపై హోం మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారు..

గత కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి మరోసారి ఆర్థిక శాఖనే కేటాయించారు.  తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడుదల రజనికి వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. గతంలో ఆళ్ల నాని ఈ శాఖను చూసేవారు. మరో సీనియర్ మంత్రి బొత్సకు విద్యాశాఖ కేటాయించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ,  అజంద్ బాషాకు మైనార్టీ శాఖ,   గుడివాడ అమర్ నాథ్ కు పరిశ్రమల శాఖ కేటాయించారు.

ఇదీ చదవండి : సీఎం చేతిని ముద్దాడి.. కాళ్లకు నమస్కారం.. ప్రమాణ స్వీకార హైలైట్స్ ఇవే సీఎం చేతిని ముద్దాడిన రోజా

డిప్యూటీ సీఎం లు వీరే..

1.అంజాద్ బాషా

2.రాజన్నదొర

3.ముత్యాలనాయుడు

4.నారాయణస్వామి

5.కొట్టు సత్యనారాయణ


మంత్రులకే కేటాయించిన శాఖలు ఇవే

1.బొత్స సత్యనారాయణ….విద్యాశాఖ

2. ధర్మాన ప్రసాద రావు…రెవెన్యూ,స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ

3. సిదిరి అప్పల రాజు..మత్స, పశుసంర్ధక

4.గుడివాడ అమరనాథ్…పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ.

5. ముత్యాల నాయుడు…పంచాయతీ రాజు, రూరల్ డెవలెప్మెంట్(డిప్యూటీ సీఎం)

6.దాడిశెట్టి రాజు..రోడ్లు, భవనాలు

7.చెల్లుబోయిన వేణుగోపాల్..సమాచార, సినిమాటోగ్రఫీ,బీసీ సంక్షేమం

8.విశ్వరూప్..ట్రాన్స్ పోర్టు.

9. తేనేటి వనిత..హోమ్ శాఖ

10. కారుమూరి నాగేశ్వర రావు..పౌర సరఫరాలు

11. కొట్టు సత్యనారాయణ..దేవాదాయ శాఖ(డిప్యూటీ సీఎం)

12. జోగి రమేష్..గృహ నిర్మాణం

13.అంబటి రాంబాబు..ఇరిగేషన్ శాఖ

14. విడుదల రజని..వైద్య ఆరోగ్య శాఖ

15. మెరుగు నాగార్జున..సాంఘిక సంక్షేమ శాఖ

16.అధిములపు సురేష్..మున్సిపల్ శాఖ

17.కాకాని గోవర్దన్ రెడ్డి..వ్యవసాయం, సహకార మార్కెటింగ్

18. కేవీ ఉష శ్రీ చరణ్..మహిళా శిశు సంక్షేమం

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..విద్యుత్, ఫారెస్ట్

20. రోజా..టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ

21. నారాయణ స్వామి..ఆబ్కారీ(డిప్యూటీ సీఎం)

22. జయరాం..కార్మిక శాఖ

23. బుగ్గన రాజేంద్ర..ఆర్ధిక శాఖమంత్రి

24.రాజన్న దొర..ST సంక్షేమ శాఖ(డిప్యూటీ సీఎం)

25.అంజాద్ బాషా..మైనార్టీ శాఖ(డిప్యూటీ సీఎం)

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, AP News, MLA Roja

ఉత్తమ కథలు