TDP 23 Number:ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒక్కోసారి సెంటిమెంట్ ను లక్కీగా భావిస్తే.. కొంతమందికి అస్సలు సెంటిమెంట్ కలిసి రావడం లేదని భయపడుతూ ఉంటారు. నిన్నటి వరకు తెలుగు దేశాన్ని కూడా అలాంటి సెంటిమెంట్ భయపెట్టింది. అదే నెంబర్ 23 సెంటిమెంట్. నిన్నటి వరకు ఆ నెంబర్ వింటుంటేనే టీడీపీ నేతలు గజ గజా వణికిపోయేవారు. కానీ అంత అన్ లక్కీ సెటిమెంట్ ను తాజాగా లక్కీ సెంటిమెంట్ గా మార్చుకుంది.. ఆ సెంటిమెంట్ వైసీకి రివర్స్ అయినట్టు ఉంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బలం లేకపోయినా.. విజయం సాధింస్తూ అధికార పార్టీకి షాక్ ఇచ్చింది.
అయితే టీడీపీ బ్యాడ్ సెంటిమెంట్ అయిన 23 ఈ సారి ఆ పార్టీకి కలిసి వచ్చింది. టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. అది కూడా ఆమెకు సరిగ్గా 23 ఓట్లే వచ్చాయి. వైసీపీ నుంచి నాలుగు ఓట్లు ఆమెకు డ్డాయి. అందులో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు.. మరో రెండు ప్రస్తుతం వైసీపీలో నే కొనసాగుతున్న వారి ఓట్లు పడ్డాయని ప్రచారం ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఎన్నిక ఫలితం తెలుగు దేశం పార్టీకి ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా..? టీడీపీ నెగ్గిన తేదీ 23.. అది కూడా 23మంది ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.. 23 ఓట్లతో టీడీపీ గెలిచింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 23 అనేది టీడీపీకి మొన్నటి వరకు నెగిటివ్ నెంబర్. ఆ నెంబర్ నే టీడీపీ.. ఇప్పుడు లక్కీ నెంబర్ గా మార్చుకుంది అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత 23 సీట్ల పేరుతో అధికార వైసీపీ.. పదే పదే టీడీపీని కార్నర్ చేస్తూ వచ్చింది. ఛాన్స్ చిక్కితే చాలు.. ఈసారి ఎన్నికల్లో మీకు 23 సీట్లు కూడా రావు అని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని టీడీపీపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతూ వచ్చారు. 23 నెంబర్ అడ్డుపెట్టుకుని ఎద్దేవా చేస్తూ వచ్చేవారు. కానీ తాజా ఫలితంతో 23 సెంటిమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ బయటపడినట్లు అయ్యింది. ఇకపై వైసీపీ నాయకులు 23 సీట్ల పేరుతో విమర్శలు చేసే అవకాశం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఇదీ చదవండి: వైసీపీ ఓటమికి కారణాలు ఇవే? ఆ ఇద్దరిపై వేటు తప్పదా..? సంబరాల్లో టీడీపీ
తాజాగా నారా లోకేష్ సైతం దీనిపై ట్వీట్ చేశారు. దేవుడు స్క్రిప్ట్ అంటే ఇది కాదా జగన్ అంటూ లోకేష్ ట్వీట్ లో సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనూరాధకి హృదయపూర్వక శుభాకాంక్షలు. తాము 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి-తమ గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ అంటూ ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు @AnuradhaTdp గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవ చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు.(1/2) pic.twitter.com/cXSpp4D4Q7
— Lokesh Nara (@naralokesh) March 23, 2023
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు. మొన్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇఫ్పుడు ఎమ్మెల్యే కట ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా వరుస విజయాలతో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇది ఆరంభం మాత్రమే.. అసలు సినిమా ముంది ఉంది అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, Chandrababu Naidu