AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ (YCP) నుంచి ఏడుగురు, టీడీపీ (TDP) నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే ఏడుగురికి మాత్రమే నెగ్గే ఛాన్స్ ఉంది. టీడీపీకి నైతికంగా చూసుకుంటే 19 మంది సభ్యుల బలమే ఉంది. కానీ అభ్యర్థి నెగ్గాలి అంటే.. 22 ఓట్లు తప్పని సరి.. అంటే మరో మూడు ఓట్లు కావాలి.. ప్రస్తుతం వైసీపీకి రెబల్ గా మారిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), అనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayna Reddy) ఇద్దరు ఆత్మాప్రబోధాను సారమే ఓటు వేస్తామని చెప్పారు. దీంతో వారిద్దరి ఓట్లు టీడీకి పడుతుందని అంచనా వేస్తున్నారు. అది జరిగితే టీడీడీపి 21 ఓట్లు పడతాయి.. అయితే మరో సభ్యుడి మద్దతు అవసరం.. అయితే వైసీీపీ నుంచి భారీగా క్రాస్ ఓట్లు ఉంటాయని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దీంతో టీడీపీకి ఓటు వేసే ఆ వైసీపీ నేతలు ఎవరు అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే ఎన్నికల పోలింగ్ మొదలైంది. సీం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా హాజరై ఓట్లు వేస్తున్నారు. రెండు పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలో.. ఎవరైనా ఎన్నికకు డుమ్మా కొడతరా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు పోలింగ్ కొనసాగుతుంటే.. మరోవైపు అధికార వైసీపీ , టీడీపీ రెండూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తమకు కనీసం 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ శిబిరం నుంచి మిస్ అయ్యారని.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని.. వారంతా ఏ క్షణమైనా టీడీపికి ఓటు వేసే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం ధీమా ప్రకటిస్తోంది. తమ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటే అవకాశం లేదంటున్నారు.
ఇదీ చదవండి : కొత్త ఏడాది పవన్ జాతకం ఎలా ఉంది..? ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతరా..? సీఎం ఛాన్స్ ఉందా..?
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారని.. ఆయన ఓటు వేయంటూ వైసీపీ వర్గాల్ల ో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు టీడీపీ నేతలు. తమ అసమ్మతి నేతల ఓట్లు చేజారకుండా చూసుకోవడం కోసం ఇలా అసత్యాలు ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News