AP POLITICS ANDHRA PRADESH MINSTER ROJA MEET TELNGANA CM KCR AND AFTER SHE WILL MEET MEGASTAR CHIRNAJEEVI NGS
Minster RoJa: హైదరాబాద్ లో ఏపీ మంత్రి బిజీ బిజీ.. సీఎం కేసీఆర్ తో భేటి.. తరువాత చిరంజీవితో..
సీఎం కేసీఆర్ తో మంత్రి రోజా భేటీ
Minster RoJa: మంత్రి పదవి దక్కడంతో మంత్రి రోజా ఫుల్ జోష్ లో ఉన్నారు. విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు క్రీడా, పర్యాటక కార్యక్రమాలపై బిజీగా కనిపించిన ఆమె.. ఇప్పుడు హైదరాబాద్ లో దర్శనమిచ్చారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.. అది కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్.. జగన్ పాలనపై విమర్శలు చేసిన సమయంలో సమావేశం కావడం విశేషం.
AP Minister RK Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్.. మంత్రి రోజా (Minster Roja) విరామం లేకుండా నిత్యం పర్యాటనలో దూకుడుగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే రంగంలోకి దిగిన ఆమె.. తన శాఖలపై పూర్తి పట్టు బిగుస్తున్నారు. వరస కార్యక్రమాలకు హాజరవుతూ హడావుడి చేస్తున్నారు. ఓ వైపు క్రీడలు (Sports).. మరోవైపు పర్యాటకం (Tourism) పై ఫోకస్ చేస్తున్నారు. మంత్రి అయ్యాక ఇలా బిజీగా మారడం కామన్ అయితే ఇప్పుడు ఆమె హైదారాబాద్ (Hyderabad) లో బిజీబిజీగా కనిపించడం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. అయితే ఏపీ ప్రభుత్వం (AP Government) తీరుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సమయంలో.. ఆయన తండ్రి కేసీఆర్ ను రోజా కలవడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను కలిసిన తరువాత ఆమె.. మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవనున్నారు. దీంతో ఆయనతో ఆమె ఏఏ అంశాలు చర్చిస్తారు అన్నది ఆసక్తికరంగానే మారింది. కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడతారా..? లేక వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయా అన్నది చూడాలి..
కారణం ఏదైనా..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి రోజా.. ప్రగతి భవన్ లో దర్శనమివ్వడంతో.. సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రచారం జరుగుతున్నా.. పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. తనకు టైం ఇవ్వాలని గురువారమే మంత్రి రోజా కోరినట్లు..దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు ప్రగతి భవన్ వర్గాలు సమయం కేటాయించారని తెలుస్తోంది. దీంతో నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్న ఆమెను కేసీఆర్ అభినందించారు. అలాగే వీరిద్దరి మధ్య సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం.
రోజా మాత్రం కేవలం మర్యాదపూర్వకంగానే తాను సీఎం కేసీఆర్ ను కలుస్తానంటూ ముందే చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సీఎం కేసీఆర్ ఆశీర్వచనాలు తీసుకోవడానికే ఇక్కడకు వచ్చారని తెలుస్తోంది. కానీ మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఏపీలో రోడ్లు, విద్యుత్ విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు భగ్గుమంటున్నారు. ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ను రోజా కలవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ రెండోసారి కేబినెట్ విస్తరణలో చిత్తూరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కింది.
ముఖ్యంగా రోజాతో సీఎం కేసీఆర్ కు కాస్త అభిమానం ఉందని పొలిటికల్ వర్గాల టాక్. గతంలో కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. గతంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజాకు ఫోన్ లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. కాంచీపురం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. నగరిలో ఆగి మరి.. రోజా ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేశారు కూడా. అలాగే హైదరాబాద్ లో ఏవైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే రోజా తప్పక హాజరవుతూ ఉంటారు. కాసేపట్లో ఆమె చిరంజీవిని కూడా కలుస్తారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.