Minister Peddireddy on Phone Tapping: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కొత్త వివాదం కలకలం రేపుతోంది. ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఎన్నికల వాతావరణం కనిపస్తోంది. దానికి తోడు పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ (Ex Minster Narayna) అరెస్ట్ ఆ దుమారాన్ని మరింత పెంచుతోంది. నారాయణ అరెస్ట్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మొన్న స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireedy Ramachandra Reddy) మొన్న చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. నారాయణ అరెస్ట్ విషయంలో మాట్లాడినప్పుడు.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అదుపులోకి తీసుకోగలిగామన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramayya) మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు.. ఫోన్ ట్యాపింగ్ పై పెద్ది రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను మాత్రం ఫోన్ ట్రాకింగ్ ద్వారా మాజీ మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నాడో గుర్తించామని చెప్పాను అన్నారు. కానీ దానిని వక్రీకరించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గట్లు మాట్లాడటం లేదని, ఒకవేళ ఆయనకు ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే.. వెంటనే వైద్యులకు చూపించుకోవాలని పెద్దిరెడ్డి సలహా ఇచ్చారు. పారదర్శకంగా ఉండేందుకే రైతు మోటార్లకు మీటర్లు పెట్టామని, వారి అకౌంట్ లో నేరుగా డిస్కం నుండి చెల్లింపులు చేస్తామని పెద్ది రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి : పెళ్లింట పెను విషాదం.. సుముహూర్తానికి సృహ కోల్పోయిన వధువు.. ఏం జరిగిందంటే?
కేవలం రాజకీయ దురుద్దేశంతో రైతులను చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీటర్లు పెడితే ఉరితాళ్లే అంటూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు లాంటి దరిద్రమైన భాష తాను మాట్లాడలేన్నారు. కుప్పంలో ఓట్లు కావాలి అనుకుంటే ప్రజలను కోరుకోండి.. కానీ రైతులను తప్పుదారి పట్టించొద్దంటూ మంత్రి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ ట్రాకింగ్ అంటే..? ట్యాపింగ్ అంటున్నారని.. మరోవైపు ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితులు అంటే అర్థం లేదన్నారు. ఆ దేశంతో ఏపీకి సంబంధం అంటే ఏంటి అన్నారు. ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నివిధాల కృషి చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలను ఇప్పటికైన మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Peddireddy Ramachandra Reddy, Ysrcp