Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH MINSTER KOTTU SATYANNARAYAN KEY COMMENTS ON TEMPLE PRIESTS NGS

AP Minster: ప్రధాన ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలి.. దేవాదాయ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

మంత్రి కొట్టు సత్యన్నారాయణ కీలక వ్యాఖ్యలు

మంత్రి కొట్టు సత్యన్నారాయణ కీలక వ్యాఖ్యలు

AP Minster: అత్యంత సున్నిత అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొన్ని దేవాలయాల్లో అనువంశిక అర్చకత్వం ఉందన్నారు. మరీ ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణులు అంభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) దేవాదాయా శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై చర్చలు జరగాలని ఆయన అన్నారు. దీనికోసం పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో (Hindu Temples) మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో త్వరలోనే ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి అన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్షలు జరుపుతున్నామన్నారు. కమిటీలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ధార్మిక పరిషత్‌తో పాటు మరికొన్ని కమిటీలు ఉన్నాయని.. సీజీఎఫ్‌కు సంబంధించి కొంత మంది సభ్యుల నియామకం కావాల్సి ఉందన్నారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు.

    కొన్ని నియామకాలు కూడా చేస్తున్నామన్నారు. సీజీఎఫ్ పురోగతిపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. న్యాయ పరమైన అంశాలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అదనపు న్యాయ సలహాదారు పోస్ట్ కోసం ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అవినీతి లేదని చెప్పలేమని.. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

    ఇదీ చదవండి : మాజీ మంత్రి గంటా పయనం ఎటు..? మహానాడుకు ఎందుకు డుమ్మా కొట్టారు..?

    ఇక విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. కనక దుర్గ గుడిని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని తెలిపారు. ప్రతి దేవాలయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని దేవాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.

    ఇదీ చదవండి : సాధారణ రైతు కూతురు కానీ ఎందిరికో ఆదర్శం.. రెండో ప్రయత్నంలోనే సివిల్ ర్యాంక్

    అయితే మంత్రి వ్యాఖ్యలపై బ్రహ్మణులు, ఆలయక అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పేద బ్రహ్మణులకు ఆదాయం లేదని.. ఆలయాల్లో పూజలు చేసుకునే చాలామంది జీవిస్తున్నామని.. ఆ ఉన్న ఉద్యోగాలు కూడా పోతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికే బ్రాహ్మణులకు చాలా వరకు అన్యాయం జరిగిందని.. వేరే పని చేసుకోలేక..  చిన్నా చితక ఆలాయాల్లో అర్చకత్వం చేసుకొని జీవించాల్సి వస్తోందని.. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాలకు ఎసరు పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

    ఇదీ చదవండి: సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం.. ఐదో ప్రయత్నంలో అద్బుతం విజయం.. ఎలా సాధ్యమైందంటే?

    చాలా ఆలయాల్లో అరకొర జీతాలతోనే కుటుంబాలను పోషించుకుంటున్నామని.. కానీ ఇప్పుడు ఇతరులకు ఆలయాల్లో అర్చకులుగా చేస్తే.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.. బ్రహ్మణులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Hindu Temples, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు