Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH MINSTER KAKAMURI NAGESWARA RAO GAVE CLARITY ON PRE ELECTIONS AND ALLIANCE NGS

AP Minster: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? పొత్తులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఆయనేమన్నారంటే..?

ముందస్తు ఎన్నికలపై మంత్రి క్లారిటీ

ముందస్తు ఎన్నికలపై మంత్రి క్లారిటీ

AP Minster: సాధరణంగా ఏపీలో ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. విపక్షాలన్నీ సమరానికి సై అంటున్నాయి.. పొత్తులతో గెలుపు ఓటముల లెక్కలు వేసుకుంటున్నాయి. దీంతో ఈ విషయాలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలు తప్పవా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా దీనిపైనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ సైతం దీనిపై భిన్న వాధనలు వినిపిస్తోంది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల (Sajjala) సైతం ఏడాదిలోనైనా ఎన్నికలు ఉండొచ్చు.. లేదా రెండేళ్ల తరువాతైనా రావొచ్చు అంటూ కన్ఫ్యూజ్ చేసేశారు. అయితే విపక్షాలు మాత్రం ముందస్తు తథ్యం అంటున్నాయి. అందుకే వైసీపీ (YCP) నేతలు హడావుడి చేస్తున్నారని.. గడప గడపకూ అంటూ జనం బాట పట్టారని.. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు.. సమరానికి సై అంటున్నాయి రాష్ట్రంలో ప్రధాన పార్టీలు.. అంతే కాదు మరో అడుగు ముందుకేసి ఇప్పటికే టీడీపీ (TDP), జనసేన (Jansena), బీజేపీ (BJP)మూడు పార్టీలు జనం బాట పట్టాయి కూడా.. అక్కడితో ఆగడం లేదు.. పొత్తుల లెక్కలు కూడా రెడీ చేసుకుంటున్నారు.. పొత్తు పెట్టుకుంటే లాభం ఎంత..? పొత్తు లేకుండా వెళ్తే పరిస్థితి ఏంటి అని అంచనాలు వేస్తున్నారు..

    ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత ఊహించని స్థాయిలో ఉంది అన్నది విపక్షాల గట్టి నమ్మకం.. అందుకే ఆ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటే.. అంతా కలిసి పోటీ చేయాలన్నది టీడీపీ, జనసేన అధినేత లెక్క.. అయితే పొత్తులు పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు.. ఎవరో ఒకరు త్యాగాలకు తలవంచకు తప్పదు.. అది అటు తిరిగి ఇటు తిరిగి రెబల్స్ పెరిగితే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో విపక్షాలు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ ముందస్తు ఎన్నికలు.. పొత్తులపై ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఇదీ చదవండి : సింహం సింగిల్ కానీ ఈ సారి తీన్మారే.. పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబునీ ఓడిస్తాం..? రాసి పెట్టుకోండి

    విపక్షాలు ఊహించుకుంటున్నట్టు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవు అని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. అసలు ఎన్నికలు లేకుండానే పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారని విపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న విపక్ష నేతలకు.. నిజంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పేంత ధైర్యం ఉందా అన్ని ప్రశ్నించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను తరిమికొట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజలందరికీ మంచి చేస్తున్న జగన్ ఒక్క మాట అన్నా ఊరుకునే పరిస్థితి లేదన్నారు..

    ఇదీ చదవండి : ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో.. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అయనదే అన్న సజ్జల

    అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లకు పరిమితం అవుతుందని మంత్రి జోస్యం చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ బట్టలు చించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయని అన్నారు. కానీ, వైసీపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని మంత్రి తేల్చి చెప్పారు. జగన్ అనే సింహం సింగిల్ గానే వస్తుందన్న మంత్రి కారుమూరి.. మళ్లీ జగన్ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీని ఎదుర్కొన్న వ్యక్తి జగన్ అని ప్రశంసించారు. చంద్రబాబే సోనియా, బీజేపీ, పవన్ కాళ్లు పట్టుకుంటారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని విమర్శించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు