AP Minister on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఫైర్ అవుతున్నారు వైసీపీ మంత్రులు, నేతలు.. ప్యాకేజ్ స్టార్ అని పిలిచిన వారిని చెప్పు తీసి కొడుతానని.. వైసీపీ సన్నాసులు అంటూ మండిపడ్డాడ.. వైసీపీ నేతలకు (YCP Leaders) ఇదే వార్నింగ్ అంటూ పవన్ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అని పవన్ అంటున్నారు.. అంటే దాని అర్థం చంద్రబాబు (Chandrababu) తో పొత్తు పెట్టుకుంటాను అనే కదా అని ప్రశ్నించారు. నిజంగా దమ్ముండి.. ప్యాకేజ్ స్టార్ వి కాకపోతే.. సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయాలి అని పేర్ని నాని సవాల్ విసిరారు. మరో పార్టీకి ఓటు వేయాలని అని పిలిచే వారిని ప్యాకేజీ స్టారే అంటారు అని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
మమల్ని కొడకుల్లారా అనేంత బలుపు ఉందా అంటూ ఫైర్ అయ్యారు. కాపులంతా మెజార్టీ సంఖ్యలో వైసీపీ వైపు ఉన్నారనే ఇలా పవన్ కడుపు మండిపోతోంది అన్నారు. నిజంగా 175 సీట్లలో పోటీ చేసి.. చంద్రబాబుకి దూరంగా ఉంటే.. అప్పుడు ప్యాకేజీ స్టార్ అని పిలవమంని.. వైసీపీ కాపు నేతలందరి తరపున తాను క్షమాపణ చెబుతాను అన్నారు పేర్ని నాని ..
చంద్రబాబుతో చెట్టపట్టాలు వేసుకునేందుకు లగ్నం దగ్గర పడిందని.. సోదరా అంటే మీకు కడుపు మండితే.. మమ్మల్ని కొడకల్లారా అంటే కడుపు మండదా.. సన్నాసిన్నర సన్నాసి అంటూ ఫైర్ అయ్యారు. నాకు కులమే లేదని చెప్పిన శుంఠవి నీవే కదా అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబంపై దాడి చేసినప్పుడు ఎక్కడున్నావని నిలదీశారు..
ఇదీ చదవండి : రాళ్లా.. రాడ్ల.. నేటి నుంచి యుద్ధానికి రెడీ.. చెప్పుతో కొడతా అంటూ పవన్ వార్నింగ్
వైసీపీ నేతలు ఒక్కర్ని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరుగుతున్నారని విమర్శించావు.. అంటే వారిని సప్లై చేసే కంపెనీ పెట్టుకున్నారా అంటూ పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. మరో మంత్రి అంబటి రాంబాబు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇలా పవన్ చెప్పులు చూపిస్తున్నారు.. అదే ఆఖరికి చివరి చెప్పు కావొచ్చు అన్నారు. వచ్చే ఎన్నిల్లో ప్రజలు ఎవరిని చెప్పులతో కొడతారో తేలిపోతుంది అంటూ అంబటి కౌంటర్ ఇచ్చారు.. సినిమాల్లో చెప్పాల్సిన డైలాగ్ లు బయట చెబితే ఎలా అని ప్రశ్నించారు. కొడక.. సన్నాసి అంటూ వ్యాఖ్యలు చేస్తే.. అదే స్థాయిలో సమాధానం వినాల్సి వస్తుంది అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అందిన తరువాతే.. ఇలా పవన్ చెప్పులు చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Perni nani, Ycp