Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH MINSTER BUS YATRA START FROM THIS MOTH 26TH THESE IS THE ROUTE MAP NGS GNT

Minsters Bus Yatra: మంత్రుల బస్సు యాత్ర టార్గెట్ ఏంటి? శ్రీకాకుళం టు అనంతపురం పొలిటికల్ రూట్ మ్యాప్ ఇదే

మంత్రుల బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే

మంత్రుల బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే

Minsters Bus Yatra:గడప గడపకు ప్రభుత్వం అంటూ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటున్నారు.. ఇప్పుడు సడెన్ గా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు మంత్రులు.. ఈ బస్సు యాత్ర టార్గెట్ ఏంటి..? టీడీపీ మహానాడు కు పోటీగా పెట్టారా..? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే ఈ యాత్ర పొలిటికల్ రూట్ మ్యాప్ ఇదే అంటున్నాయి వైసీపీ వర్గాలు.

ఇంకా చదవండి ...
  Minsters Yatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని పార్టీలు జనం జపం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ జనంలోనే ఉన్నాయి. ఇక అధికార వైసీపీ (YCP) ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ.. పథకాలపై ఆరా తీస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు.. అయితే ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మొదట ఎమ్మెల్యే గ్రాఫ్ పెంచడానికి ఈ కార్యక్రమం అని చెప్పినా.. చివరిలో పేరు మార్చి.. ప్రభుత్వ పథకాలు, పనితీరుపై ప్రజల స్పందన ఏంటో తెలుసుకోవడానికి గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ వెళ్తున్నారు. అయితే చాలాచోట్ల నిరసన సెగలు ఎదురవుతున్నాయని విపక్షాలు అంటుటన్నాయి. వాటికి వీడియోలు సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాయి.  వైసీపీ నేతలు మాత్రం.. తమ కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తోంది అంటున్నారు.

  ఈ బస్సు యాత్ర ఉద్దేశం వేరని టీడీపీ నేతలు అంటున్నారు. మహానాడు (Mahanadu) నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ బస్సు యాత్ర ప్లాన్ చేసిందని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆరోపిస్తున్నారు. సరిగ్గా మహానాడు జరుగుతున్న సమయంలోనే.. వైసీపీ ఈ బస్సు యాత్రను పెట్టుకుంది. అందుకే ప్రతిపక్షం ఆరోపిస్తోంది. గడప గడపకు అని వెళ్తే.. ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయని.. ప్రజల నుంచి చీత్కారాలు తప్పించుకోవడానికే ఇప్పుడు అధికార పార్టీ మనసు మార్చుకుందని విమర్శలు ఉన్నాయి.  విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..? ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టడానికి సిద్ధం అయ్యారు. మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామన్నారు. నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందన్నారు.

  ఇదీ చదవండి : బెల్లం కొనాలి అంటే ఆధార్ కార్డు ఉండాలా? విక్రయాలు సాగేదెలా అంటున్నవ్యాపారులు? ఆధార్ కార్డ్ ఎందుకో తెలుసా?

  ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లే టార్గెట్ గా ఈ యాత్ర సాగుతున్నట్టు సమాచారం. ఆయా వర్గాల ఓట్లు సాలిడ్ గా ప్రభుత్వానికి పడితే మరోసారి గెలుపు తమదే అని వైసీపీ అధిష్టానం అంచనావేస్తోంది. అందుకే ఆయా ఓట్లు టార్గెట్ గానే ఈ యాత్రం ఉంటుందని సమాచారం.. ఈ బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి ధర్మాన వెల్లడించారు. పాలన చేసే వారుగా ఎప్పుడు మారతాం అన్న ఆవేదన ఈ నాలుగు వర్గాల్లో ఉందని.. వీరి ఆత్మ ఘోషణను నివారించడానికి వైసీపీ కంకణం కట్టుకుందన్నారు.

  ఇదీ చదవండి : నేను కన్నెర్ర చేస్తే.. సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారంటే..?

  గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలా గొప్ప విషయంగా భావించే వారు అని.. వెనుకబడిన వర్గాల వారు మంత్రి పదవులు పొందడానికి అర్హులు కారనే భావజాలం ఉండేదని.. అదే ప్రస్తుతం కేబినెట్‌ ను పరిశీలిస్తే.. 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమని మంత్రి ధర్మాన అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాలకు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదని చెప్పి నమ్మించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి ధర్మాన విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే తాము బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేస్తే తెలంగాణ వ్యక్తి అంటున్నారని… చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలని మంత్రి ధర్మాన సూటిగా ప్రశ్నించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు