Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH MINSTER BOTSA SATYANARAYNA SENSATIONAL COMMENTS ON HIS OWN PARTY NGS VZM

Botsa: ఇలా అయితే మళ్లీ గెలవడం కష్టం.. సీఎం ఆశయాలకు తూట్లు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

మంత్రి బొత్స సత్యానారాయణ

మంత్రి బొత్స సత్యానారాయణ

Minster Botsa: వైసీపీలో వర్గ పోరు పెరిగిందా..? నేతల మధ్య సమన్వయం లేదా..? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు పార్టీకి చేటు చేస్తున్నాయా..? సీఎం ఆశయాలను నేతలను పట్టించుకోవడం లేదా..? స్వయానా మంత్రే ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  Minster Botsa Satyanarayana:  అధికార వైసీపీ (YCP)లో అలజడి ఉందా..? పార్టీ గెలుపుపై కీలక నేతల్లో అనుమానాలు బలపడుతున్నాయా..? పార్టీలో కొందరి నేతల తీరుతో నష్టం తప్పదా..? అది కూడా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలోనే పార్టీ నాయకులు.. లైన్ క్రాస్ చేస్తున్నారా..? తాజాగా మంత్రి .. ఉత్తరాంధ్ర రీజనల్ కోర్డినేటర్ (Regional Coordinator) బొత్స సత్యానారాయణ (Botsa Satyanarayana) ఆగ్రహానికి కారణం అదేనా.. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు అధికార వైసీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.  ముఖ్యంగా పదవులు పొందిన భార్యల స్ధానంలో భర్తలు పార్టీ సమావేశానికి హాజరు కావటం సిగ్గుచేటని.. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని  బొత్స ఒకింత పార్టీ నాయకులను హెచ్చరించారు. పార్టీ నాయకులెవరూ ఒంటెద్దు పోకడలకు పోవొద్దని ఆయన సూచించారు.

  విజయగనరం జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లా (Vizianagaram District) వైసీపీ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. ఇక పార్టీ శ్రేణులనుద్దేశించి బొత్స చేసిన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చాక మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ పదవుల్లో యాభై శాతం పదవులను మహిళలకు కేటాయించారని తెలిపారు.

  ఇదీ చదవండి : పాలన అంటే విధ్వంసమేనా..? నిర్మాణాలు ఎక్కడ.. దాళితులపై దాడులు దారణం

  జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించవద్దని బొత్స హితవు పలికారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో మహిళా నేతల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో మంత్రి బొత్స తనదైన శైలిలో సుతిమెత్తగా శ్రేణులను హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించిన యాభై శాతం రిజర్వేషన్లు ద్వారా మహిళలు పదవులు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. పాలనలో, పార్టీ పదవుల్లో సగానికి సగం మంది మహిళా నేతలు ఉండగా, కీలకమైన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎందుకు మహిళా నేతల హాజరు తక్కువగా ఉందని శ్రేణులను ప్రశ్నించారు.

  ఇదీ చదవండి: పెళ్లాం ఊరెళితే.. ప్రియురాలితో సరసాలు.. ట్విస్ట్ ఏంటంటే? అమ్మే పట్టించింది

  పార్టీ సమావేశాలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు మహిళా నేతలను వెళ్ళనివ్వకుండా భర్తలు అడ్డు పడొద్దని, ఏవేవో వంకలు చెప్పి వారిని ఇళ్లకు పరిమితం చేయొద్దని సూచించారు. ఇటువంటి పోకడలను పార్టీ చూస్తూ ఊరుకోదని ఘాటుగా హెచ్చరించారు. పదవుల్లో ఉన్న భార్యల పక్కన కూర్చొని పెత్తనం చెలాయించుకోండి, అంతేకానీ వారిని కార్యక్రమాల్లో పాల్గొనకుండా మాత్రం కట్టడి చేయొద్దని ఆయన ప్రసంగంలో రెండు సార్లు ఈ అంశాన్ని బొత్స ఉద్ఘాటించారు.

  ఇదీ చదవండి: చంద్రబాబు దేశాన్ని నాశనం చేశారు.. పవన్ ప్యాకేజ్ స్టార్.. రూట్ మార్చిన పాల్

  ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు గడప గడపకి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు గుర్తు చేసేలా శ్రేణులు సన్నద్ధం కావాలని బొత్స పిలుపునిచ్చారు. కొత్త కమీటీలు నియమించి పార్టీకి కొత్త జవసత్వాలు నింపాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో భాగంగానే చిన్న శ్రీను( మజ్జి శ్రీనివాసరావు)ను జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేశారని పేర్కొన్నారు.

  ఇదీ చదవండి : టీడీపీతో పొత్తుకు పవన్ సై..! నై అంటున్న ఏపీ బీజేపీ? అధిష్టానం మాటేంటి

  పార్టీలో వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్న జెడ్సీటీసీపీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, కార్పొరేటర్ లు, సచివాలయాలకు వెళ్లి కూర్చొని ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చవచ్చని, కానీ ఎమ్మెల్యేలు వెళ్లి సచివాలయాల్లో కూర్చోలేరని ఎమ్మెల్యే కోలగట్ల చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి బొత్స సమాధానం ఇచ్చారు. రానున్న రెండేళ్లు కష్టపడితే మరో ఐదేళ్లు వైసీపీవేనని.. మంత్రులకు సచివాలయాలుంటే జిల్లాల్లో ఉన్న సచివాలయాలన్నీ ఎమ్మెల్యేలవేనని బొత్స వ్యాఖ్యానించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Botsa satyanarayana, Vizianagaram, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు