Minster Botsa On AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Andhra Pradesh Capital Amaravati) అని కేంద్రం అంటోంది.. హైకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది. అమావతి రైతులకు సీఆర్డీఏ ఫ్లాట్ల రిజిష్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.. దీంతో అమరావతే రాజధాని అంతా ఫిక్స్ అవుతున్న సమమయంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ వైసీపీ(YCP) విధానమని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో మరోసారి రాజధాననుల అంశం రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా మూడు రాజధానులపై మంత్రులు స్పందిస్తూనే ఉన్నారు. మరోసారి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై స్పందించారు. సరైన సమయం కోసం చూస్తున్నామని.. తప్పకుండా మూడు రాజధానుల బిల్లు వచ్చి తీరుతుందని క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ఒకటే మాట చెబుతుందని.. అదే మాట మీద నిలబడుతుంది అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృధ్ధే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి బొత్స.
అన్నిటికీ అనుకూలంగా ఉండే సమయం చూసుకుని అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో అని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే అమరావతి విషయంలో హైకోర్టు కొద్ది రోజుల క్రితం రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకు తప్ప వేరే దానికి వాడకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది. ఇలాంటి సమయంలో బొత్స ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో చర్చకు తెరతీసినట్టు అయ్యింది.
ఇదీ చదవండి : టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు అధిష్టానం హ్యాండ్ ఇస్తుందా..? కారణం అదేనా..?
హైకోర్టు తీర్పుపై అదేరోజు స్పందించిన బొత్స సత్యనారాయణ పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు.
ఇదీ చదవండి : డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రివిలేజ్ నోటీసులు.. లోకేష్ ను అలా అనలేదన్న నారాయణస్వామి
న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. మళ్లీ ఇప్పుడు మూడు రాజధానుల విషయం తమ విధానం మారదని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్వేయమన్నారు ఆయన. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారులను ఎందుకు పట్టించుకోలేదని మరోసారి ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఆలోచనలే తమకు శిరోధార్యం అని చెప్పిన మంత్రి.. టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమని తేల్చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap capital, Botsa satyanarayana