Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH MINSTER BOTSA SATYANARAYANA KEY COMMENT LAND ALLEGATIONS IN VISAKHAPATNAM NGS VSP

Minister Botsa: విశాఖలో భూముల కబ్జా ఆరోపణలకు కారణం ఆయనే..? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa: కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ అని వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి విశాఖలో భూములకు రెక్కలొచ్చాయి.. ధరలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఇదే సమయంలో భూ కబ్జాలపై ఆరోపణలు పెరిగాయి. తాజాగా ఆ ఆరోపణలపై స్పందించిన మంత్రి బొత్స.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    P Anand Mohan, Visakhapatnam, News18.

    Minister Botsa: ప్రస్తుతం రాజకీయ నేతల అందరి చూపూ విశాఖపట్నం (Visakhapatnam) పైనే పడింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపటిటల్ గా చేస్తామని ప్రకటించినప్పటి నుంచి.. అందరి ఫోకస్ విశాఖపైనే పడింది. అంతే కాదు అప్పటి నుంచి విశాఖలో భూమల ధరకు రెక్కలు వచ్చాయి. మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. అదే సమయంలో విశాఖలో భూములుపై మాఫియా కన్ను పడిందని.. భారీగా కబ్జాలు (Land Grabbing) జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ రోపణలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూములపై టీడీపీ (TDP) తప్పుడు ప్రచారం చేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేశారు. ఈ భూములకు సంబంధించి టీడీపీ హయాంలోనే జీవో నెంబర్‌ 121 జారీ చేశారని గుర్తు చేశారు ఆయన. తమ ప్రభుత్వం భూముల విషయంలో అంతా పారదర్శకంగా ముందుకెళ్తోందన్నారు. చంద్రబాబు (Chandrababu) హయాంలోనే ఎన్‌సీసీ సంస్థకు జీపీఏ ఇచ్చారని… కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ సమావేశంలోనే మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం జీపీఏను ఉపసంహరించిందని తెలిపారు. విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

    అక్కడ భూమి విలువ 197 కోట్ల రూపాయలుగా ఉందని టూ మెన్ కమిటీ నిర్ణయించిందని మంత్రి బొత్స చెప్పారు. డబ్బులు కట్టాలని ఎన్‌సీసీ సంస్థకు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. ఆ విషయంలో ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని.. ఎవరినీ విడిచి పెట్టం అంటూ బొత్స స్పష్టం చేశారు. అలాగే విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై దర్యాప్తు ఆపే ప్రసక్తే లేదన్నారు. గత మూడు రోజులుగా విశాఖలో ఒక భూమిని ప్రభుత్వం దారా దత్తం చేసిందని.. ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ncc సంస్థకు ఇచ్చిన భూమి 2005లో ppp మూడ్ లో ఆ భూమిని అభివృద్ధికి ఇచ్చారని ఆయన తెలిపారు. అందుకు గాను ఆ సంస్థ 90 కోట్ల రూపాయల ప్రభుత్వానికి చెల్లించిందని తెలిపారు. ఆ మొత్తం భూమి 97 ఎకరాల 10 సెంట్లు ఉందన్నారు.

    ఇదీ చదవండి : సీఎం జగన్ ఢీల్లీ పర్యటనకు కారణం ఇదే.. వైరల్ అవుతున్న ట్విటర్ పోల్.. మీ అప్షన్ ఏంటి అంటూ ప్రశ్న

    అయితే అనుకున్న సమయం కంటే ప్రాజెక్టు చేపట్టడం పూర్తిగా ఆలస్యం కావడంతో ncc సంస్థతో ఒప్పందాన్ని 2013లో ప్రభుత్వం రద్దు చేసుకోవాలని భావించిందన్నారు. అయితే 2014లో ncc సంస్థ హైకోర్టుకు వెళ్ళిందని.. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల ముందు ncc సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మ్యూచివల్ అండర్ స్టాండింగ్ కు వచ్చిందని గుర్తు చేశారు. టూ మెన్ కమిటీ భూ విలువను అంచనా వేసిన తరువాతే భూమి ఇస్తామని తమ ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జీపీఏను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

    ఇదీ చదవండి : మరోసారి మనసు టచ్ చేసిన సీఎం.. కాన్వాయ్ మధ్యలో 108కు దారిచ్చిన జగన్

    197 కోట్ల రూపాయల డబ్బును చెల్లించి రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టమని ncc సంస్థకు చెప్పామన్నారు మంత్రి బొత్స. దీంట్లో ఎక్కడ తప్పుందో చెప్పాలని విపక్షాలను ఆయన కోరారు. మొత్తం రిజిస్ట్రేషన్ చెయ్యమని చెబుతున్నామని తెలిపారు. తాను చెప్పింది చంద్రబాబును చెప్పమనాలని అన్నారు. చంద్రబాబు హయాంలోనే జీపీఏ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని తెలిపారు. ఈ వివాదంపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ధర్నా చేసిన తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబును అడగాలని సూచించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Botsa satyanarayana, Chandrababu Naidu, Visakhapatnam

    తదుపరి వార్తలు