హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vellampalli Srinivas: దుర్గగుడిలో అవినీతి ఎఫెక్ట్... మంత్రి పదవికి టైమ్ దగ్గర పడిందా..?

Vellampalli Srinivas: దుర్గగుడిలో అవినీతి ఎఫెక్ట్... మంత్రి పదవికి టైమ్ దగ్గర పడిందా..?

విజయవాడ దుర్గగుడి

విజయవాడ దుర్గగుడి

విజయవాడ (Vijayawada) దుర్గగుడిలో (Durga Temple) అవినీతి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంద్రకీలాద్రికి అంటిన అవినీతి మరక ఇప్పుడు కీలక వ్యక్తులకు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  విజయవాడ దుర్గగుడిలో అవినీతి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంద్రకీలాద్రికి అంటిన అవినీతి మరక ఇప్పుడు కీలక వ్యక్తులకు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈవో సురేష్ బాబుపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఈ సెగ దేవాదాయశాఖ మంత్రి వెల్లిపల్లి శ్రీనివాస్ కు తగలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెల్లంపల్లిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి పాత్రపై ఖచ్చితమైన సమాచారం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే వెల్లంపల్లిని తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. వెల్లంపల్లిని తప్పించేందుకే ఏసీబీ సోదాలు చేయించి అవినీతిని వెలికి తీసినట్లు తెలుస్తోంది.

  దుర్గగుడి వెల్లంపల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. తన సొంత నియోజకవర్గంలోని ప్రధాన ఆలయంలో అవినీతి మంత్రికి తెలియకుండానే జరిగిందా..? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దసరా ఉత్సవాల అనంతరం హుండీ లెక్కింపు సందర్భంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శించినప్పుడు మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసినట్లు ఆరోపలు వచ్చాయి. ఒక్క దుర్గగుడే కాదు...అంతర్వేది రథం, రామతీర్థంతో పాటు రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన ఘటనలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోవడం, వివాదాలను అరికట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి.

  ACB Raids Kanaka Durga Temple, Durga Temple, Indrakeeladri, Durga Temple news, Vijayawada Durga Temple, Kanaka Durgamma, Vijayawada, Andhra Pradesh endowment Department, Anti-Corruption bureau, AP Endowment Department, Durga Temple EO Suresh Babu, Andhra Pradesh Government, AP Government, Vijayawada News, Andhra Pradesh news, Ap news, Telugu news, కనకదుర్గ ఆలయంలో ఏసీబీ దాడులు, దుర్గగుడి, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయం, కనకదుర్గ ఆలయం, విజయవాడ దుర్గగుడి, కనకదుర్గమ్మ, విజయవడా, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, అవినీతి నిరోధక శాఖ, ఏపీ దేవాదాయ శాఖ, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, విజయవాడ న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, Minister Vellampalli Srinivas, Vellampalli Srinivas, AP minister Vellampalli, Andhra Pradesh minister Vellampalli Srinivas, Vallampalli Srinivas News, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ మంత్రి వెల్లంపల్లి, ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ న్యూస్
  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫైల్)

  ఇది చదవండి: దుర్గమ్మ సన్నిధిలో అడుగడుగునా అవినీతి.. ఈవోపై సంచలన ఆరోపణలు  దుర్గగుడిలోఅవినీతి వ్యవహారంలో ఈవో సురేష్ బాబుపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా.. ఆయనకు మంత్రి అండదండలున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సురేష్ బాబును ఈవోగా నియమించడంలో వెల్లంపల్లి కీలక పాత్ర పోషించారని.. ఆయనకు అర్హత లేకపోయినా ప్రమోషన్ ఇచ్చి ఈవోగా తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై జరిపిన సోదాల్లో 16 మందికి అవినీతిలో హస్తమున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే వీరందరినీ సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే ఈ వ్యవహారంలో పైస్థాయి అధికారులను వదిలి పెట్టి కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయడాన్ని ఆలయ ఉద్యోగులు తప్పుబడుతున్నారు. గడచిన 20 నెలల్లో దుర్గగుడిలో దాదాపు రూ.12 కోట్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా ఈవో సురేష్ బాబుకు తెలిసే జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఒక్క రుపాయికే ఫ్లాట్... పేదలకు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్..  ఈవో సురేష్ బాబు వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆయనకు అర్హత లేకపోయినా ముడుపులిచ్చి సింహాచలం నుంచి దుర్గగుడికి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక సెక్యూరిటీ, శానిటైజేషన్ సిబ్బందికి సబంధించిన టెండర్లు, టికెట్ల విక్రయాలు, చీరల విక్రయాలు, సరుకుల కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే లాక్ డౌన్ సమయంలో ఉచిత దర్శనాలకు కోటా విధించి.. ఇష్టానుసారం రూ.300, రూ.500 టిక్కెట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఒకే టికెట్ ను పలుమార్లు అమ్మడం, నకిలీ టిక్కెట్లు ముద్రించడం ద్వారా దుర్గగుడికి రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Durga temple, Telugu news, Vellampalli srinivas, Vijayawada

  ఉత్తమ కథలు