హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: సర్పంచ్ గా గెలవండి.. సినిమా డైలాగులు కాదు సీఎంతో పోటీ అంటే.. పవన్ కు మంత్రి రోజా కౌంటర్లు

Minister Roja: సర్పంచ్ గా గెలవండి.. సినిమా డైలాగులు కాదు సీఎంతో పోటీ అంటే.. పవన్ కు మంత్రి రోజా కౌంటర్లు

పవన్ కు రోజా కౌంటర్

పవన్ కు రోజా కౌంటర్

Minister Roja: అధికార వైసీపీ, జనసేన మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా జనసేనాని పవన్ ను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రులు, మంత్రులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి రోజా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ రచ్చ రచ్చ అవుతున్నాయి. ఒకప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ (YCP vs TDP) గా ఉన్న మాటల యుద్ధం.. ఇప్పుడు జనసేన (Janasena)గా కూడా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ.. మంత్రులు, మాజీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజా మూడు రాజధానుల విషయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు రాజధానులు (Three Capitals) ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ అంటుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలోనూ సీఎం జగన్ తీరును పవన్ కళ్యాన్ తప్పు పట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు.

  ప్రపంచంలో ప్రతి దానికి ఎక్స్ పెయిర్ డేట్ ఉంటుందని.. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా ఉంటుందన్నారు. 151 సీట్లు వచ్చాయని ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన మహానుభావులు కాలేరని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.  

  Pawan Kalyan|| వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇవే ||గెలిచే వారిక... https://t.co/BcGgYQKY20 via @YouTube #pawanakalyanbdaycdp #Pawanakalyan #JanaSenaParty #janavaanijanasenabharosa #YSRCP #TDPTwitter #YSJaganDarkGovernance #YSJaganFailedCM

  తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన సర్వే.. జనసేనకు ఎన్ని వస్తాయనే విషయం చెప్పలేదా అని ప్రశ్నించారు.

  నిజంగా పవన్ తన పార్టీపై నమ్మకం ఉంటే సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు…నేరుగా సీఎం తో పోటీ పడాలని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కనీసం సర్పంచ్ గా అయినా ఎన్నికయ్యి చూపించండి అంటూ ఎద్దేవ చేశారు.

  నారా లోకేశ్ (Lokesh) తన యత్రని రద్దు చేస్తే, పవన్ కూడా రద్దు చేసుకున్నారని, కేసుల భయంతో మాజీ ముఖ్యమంత్రి కరకట్టపై దాక్కున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అసెంబ్లీ కి ఏడ్ల బండిపై వచ్చి నవ్వుల పాలు అయ్యారని, అసలైన రైతు ద్రోహులు చంద్రబాబు , లోకేశ్ లేనని మండిపడ్డారు. ప్రభుత్యం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి రోజా .. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత చంద్రబాబు దేనని చెప్పారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Minister Roja, Pawan kalyan

  ఉత్తమ కథలు