Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జీవో 1 దుమారం ఆగడం లేదు. రోజు రోజుకూ దీనిపై తీవ్ర విమర్శలు పెరుగుతున్నాయి. విపక్షాలన్నీ జగన్ సర్కార్ తీరును తప్పు పడుతున్నాయి. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించడంతో జగన్ ను నియంతగా పోల్చుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrbabu Naidu) చేపట్టిన కుప్పం ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో కుప్పం (Kuppam) కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వం తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే తన నియోజవకవర్గంలో ప్రజలను కలవాలి అంటే జగన్ పరిమిషన్ తీసుకోవాలా..? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు కూడా తమదైన స్టైల్లో ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
మనసున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు.. అలాంటి నేతను చంద్రబాబు సైకో అనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నారంటే అది చంద్రబాబే అని రోజా ఆరోపించారు. చంద్రబాబు చిత్తూరులో జన్మించడం తమకు అవమానకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం జీఓ నెం.1 తీసుకొస్తే.. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలను వరుసగా తీసిన చంద్రబాబు ఉన్మాది. సీఎం జగన్ కక్ష సాధింపునకు దిగితే టీడీపీ , జనసేన నాయకులు ఏపీలో తిరగలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, పవన్ లాంటివారి గురించి సీఎం జగన్ టైం వేస్ట్ చేయరన్నారు. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని.. అందుకే సీఎం జగన్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ కూడా కందుకూరు, గుంటూరులో మృతులకు ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సీఎం జగన్ రాజకీయ సమాధి కట్టేస్తారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Ycp