హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: మంత్రిపై హత్యకు ప్రయత్నించారా..? సైకో ఫ్యాన్స్ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: మంత్రిపై హత్యకు ప్రయత్నించారా..? సైకో ఫ్యాన్స్ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

రోజా  (Photo Twitter)

రోజా (Photo Twitter)

Minister Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాపై హత్యా యత్నం జరిగిందా..? జనసేన ఫ్యాన్స్ ఆమె హత్య చేయాలని అనుకునే దాడి చేశారా.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా ఆమెనె ఈ కామెంట్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Minister Roja:  జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్టు (Airport) లో మంత్రుల కన్వాయ్ పై జరిగిన దాడి దుమారం ఆగడం లేదు. తాజాగా మంత్రి రోజా (Minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న తనపై హత్యా యత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కు చెందిన కొందరు సైకో ఫ్యాన్స్.. కర్రలు.. రాళ్లతో తన వైపు దూసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారనన్నారు. పోలీసులు అప్రమత్తంగా లేకుండా.. ఆ సైకో ఫ్యాన్స్ మమ్మల్ని హత్య చేసేవారేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులపై దాడి జరిగితే ఖండించాల్సిన పవన్ కళ్యాణ్.. ఈ దాడి వైసీపీ ప్లాన్ అనడం బాధాకరం అన్నారు. అయితే మంత్రులపై దాడి జరిగితే.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పవన్ కళ్యాణ్ ను పరామర్శించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు విశాఖ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలపై మంత్రి రోజా సహాయకుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ దాడిలో తాను గాయపడ్డానని దిలీప్ వెల్లడించారు. ఓ లోహపు మూత తగిలి తన తలకు గాయమైందని తెలిపారు.

ఈ దాడిలో 300 మంది జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వివరించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారని దిలీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగానే జనసేన నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు..

ఇదీ చదవండి : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఓ ఫ్యాక్షన్ ముఠా నాయకుడు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ద్వజమెత్తారు. పవన్ ఓ రాజకీయ పార్టీకి నాయకుడిలా కాకుండా ఓ ఫ్యాక్షన్ ముఠాకు నాయకుడులా వ్యవహరిస్తున్నాడన్నారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణిని ప్రభుత్వం అడ్డుకోలేదని.. మా మంత్రులపై దాడి చేసిన నిందితుల్ని వదిలి పెట్టే వరకు విశాఖపట్నం వదిలి వెళ్లనని శబ్దం చేసి కూర్చున్నాడన్నారు.

ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ వదిలేసింది.. ఎన్నికల్లో పోటీపై వల్లభనేని వంశీ క్లారిటీ

నేర చరిత్ర కలిగిన వారికి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి నోట్లోని నాలుకతో పాటు మాట్లాడే మాటకు కూడా నరం లేదన్నారు. ఏ రోజు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja, Pawan kalyan, Perni nani

ఉత్తమ కథలు