హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Botsa: అమరావతి రైతులను రెచ్చగొట్టొద్దు.. సొంత పార్టీ నేతలకు మంత్రి వార్నింగ్.. అదే జరిగే పదవికి అనర్హుడిని..

Minister Botsa: అమరావతి రైతులను రెచ్చగొట్టొద్దు.. సొంత పార్టీ నేతలకు మంత్రి వార్నింగ్.. అదే జరిగే పదవికి అనర్హుడిని..

బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ

Minister Botsa: సీఎం జగన్ కేబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రుల్లో బొత్స ఒకరు.. అయితే ఆయన ఏమాట్లాడినా అది సంచలనంగానే మారుతుంది. తాజాగా అమరావతి రైతు ఉద్యమానికి సంబంధించి ఆయన ఘాటుగా మాట్లాడారు. రైతులను ఎవరూ రెచ్చగొట్టవదంటూ సొంత పార్టీ వాళ్లకే క్లాస్ పీకారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Minister Botsa: అమరావతి రైతుల ఉద్యమం (Amaravati Farmers Protest) కొనసాగుతోంది. తమ ఉద్యమం వేయి రోజులు దాటడంతో ఇప్పటికే మహా పాదయాత్ర (Maha Padayatra) చేపట్టారు. ప్రస్తుతం రైతుల మహాపాదయాత్ర నేటితో 14 వ రోజు కొనసాగుతోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందనే వస్తోంది. వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో.. యాత్ర విజయవంతంగా సాగుతోంది. కానీ గుడివాడ (Gudivada)లో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నిన్న కనిపించాయి. ఎందుకంటే మా జోలికి వస్తే ఊరుకోం.. ఎగరేసి నరుకూతాం అంటూ.. వైసీపీ యువ దళం పేరుతో బ్యానర్లు వెలిశాయి. దీంతో రాజధాని రైతలు సైతం అక్కడకు వెళ్లిన తరువాత తొడకొట్టి మీసం మెలేశారు. పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

  ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులను ఎవరూ రెచ్చగొట్టొద్దంటూ సొంత పార్టీ వారికే క్లాస్ పీకారు. పరిపాలనా వికేంద్రీకరణపై విశాఖపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..?

  వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా చలరాజధానిగా చేస్తున్నామన్నారు. అలాగే విశాఖను పరిపాలన రాజధానిగా మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. విశాఖ రాజధానిగా వస్తే ఉద్యోగాలు వస్తాయని, పరిశ్రమలు వస్తాయని.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అన్నారు.

  ఇదీ చదవండి : రేషన్ కార్డ్ హోల్డర్ కు బిగ్ షాక్.. ఇకపై నుంచి అవి కూడా కట్..! ఎందుకంటే..?

  తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని తెలిపారు. అలా జరగనప్పుడు తాను మంత్రి పదవికి అనర్హుడని అన్నారు. 29 గ్రామాలకోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని బొత్స అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని బొత్స వివరణ ఇచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని తెలిపారు. అలాగే టాప్ -5 సిటీస్ లో విశాఖ ఉందని, విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

  ఇదీ చదవండి : ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

  3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్మోహణ్ రెడ్డి స్పష్టం గా చెప్పారని.. ఆ విషయంలో వెనక్కు తగ్గేదే లే అన్నారు. రాజధాని ప్రతిపాదన ఇచ్చిన సంస్థకు కోట్ల రూపాయల ఫీజు ఇచ్చారని.. అక్కడ నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని అన్నారు. అదే విశాఖలో అయితే మాత్రం తక్కువ అవుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో అంత ఖర్చు అవసరం లేదనేది తమ ఆలోచన అన్నారు. శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తున్నామన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, Ap cm jagan, AP Three Capitals, Botsa satyanarayana, Visakhapatnam

  ఉత్తమ కథలు