Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH HOME MINSTER TANETI VANITA SERIOUS WARNING TO WHO PROTEST IN KONASEMA NGS

Konaseema Tension: అమలాపురంలో ఆగని ఆందోళనలు.. వారిపై చర్యలు తప్పవని హోం మంత్రి వార్నింగ్..

మంటల్లో తగలబడుతున్న మంత్రి ఇల్లు

మంటల్లో తగలబడుతున్న మంత్రి ఇల్లు

Konaseema Tension: జిల్లా పేరు మార్పు తెచ్చిన చిచ్చు ఆగడం లేదు.. మంత్రి ఇంటిని తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది. ఆందోళనలు ఇంత హింసాత్మకంగా మారుతాయని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది.. దీంతో హోం మంత్రి అలర్ట్ అయ్యారు. ఆందోళన కారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇంకా చదవండి ...
    Konaseema Tension: 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మారింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు (AP New District) విషయంలోనూ ఆందోళనలు కనిపించాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కనిపించినా.. ప్రభుత్వం అనుకున్నట్టే 26 జిల్లాలను ఏర్పాటు చేసి.. పాలన కూడా ప్రారంభించింది. అక్కడి వరకు బాగానే ఉంది.  ఇప్పుడు జిల్లా పేరు మార్పు విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా (Konaseema) పేరును డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని కొందరు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం కొనసీమ పేరును ఇటీవలే అంబేద్కర్ జిల్లా పేరు మార్చింది. దీంతో మరో వర్గం ఆందోళన బాటు పట్టింది. పరిస్థితి హద్దులు దాటింది. అయితే ఆందోళనలు పెరగడంతో అలర్ట్ అయిన పోలీసులు 144 సెక్షన్ విధించారు.. దీంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని అంచనా వేశారు. కానీ ఊహించని విధంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అంబేద్కర్ పేరు పెట్టడంపై అమలాపురం భగ్గుమంది. ఆఖరికి మంత్రి ఇంటికే నిప్పు పెట్టేంతగా ఆందోళనలు మారాయి..

    ఉదయం నుంచే కోనసీమ పరిస్థితి ఉధ్రిక్తంగా కనిపించింది. కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు పోలీసులు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల యత్నించగా.. లాఠీచార్జ్‌తో వారిని చెదరగొట్టారు. మరికొందరు యువకులు అమలాపురం బస్‌స్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి గన్‌మెన్ సహా 20 మంది గాయపడ్డారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (Minster Pinepi Viswaroop) కార్యాలయాన్ని, ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమలాపురంలో యువకుల నినాదాలు, పోలీసుల లాఠీఛార్జ్, రాళ్లదాడితో అమలాపురం రణరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఇదీ చదవండి : పిచ్చిది అంటూ ఎగతాళి చేశారు.. ఇప్పుడు గుడి కట్టి పూజిస్తున్నారు? అసలేమైంది?

    అయితే తాజా పరిస్థితిపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే మార్చామని హోంమంత్రి తానేటి వనిత (Home Minster Taneti Vanita) చెప్పారు. సమస్య ఉంటే శాంతియుంగా తెలియజేస్తే ప్రభుత్వం ఆలోచిస్తుందని.. కానీ ఇలా చెలరేగిన హింసాత్మక సంఘటనలకు పాల్పడడం మంచిది కాదని అన్నారు. జిల్లా పేరు మార్చిన తర్వాత కొందరు సంఘ విద్రోహశక్తులు వెనుక ఉండి అమలాపురంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

    ఇదీ చదవండి : కేటీఆర్ ను జగన్ అంత మాట అన్నారా? ఆ వ్యాఖ్యల తరువాత ఒకే వేదికపై ఇలా.. ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

    ఈ అల్లర్లకు పాల్పడిన వారిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు. ఆందోళన కారులు చేసిన రాళ్ల దాడిలో 20 మంది పోలీసులకు గాయాలు అయ్యాయని ఆమె తెలిపారు. నిరసనకారులు ప్రైవేటు స్కూలు వాహనాన్ని దగ్దం చేశారని, పోలీసు జీప్ పై కూడా రాళ్ల దాడి చేశారని… కొందరు అల్లర్లు చెలరేగేలా వ్యవహరించడం బాధాకరం అని ఆమె అన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నావారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు