Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT TO HOLD ASSEMBLY MONSOON SESSION FROM JULY 19TH FULL DETAILS HERE PRN

AP Assembly: ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ..? సభ ముందుకు వచ్చే అంశాలు ఇవేనా..?

స్పీకర్ తమ్మినేని సీతారాం (ఫైల్)

స్పీకర్ తమ్మినేని సీతారాం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. సమావేశాల నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. సమావేశాల నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 18న సాయంత్రం లేదా 19న ఉదయం అసెంబ్లీ బీఏసీ సమావేశాలు నిర్వహించి ఎంజెండాను ఖరారు చేసే అవకాశముంది. సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి, ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే 10 నుంచి 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకోనున్నారు.

    ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైనందున సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి సంబంధించిన బిల్లులకు ప్రాధాన్యమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రాజధాని అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది చర్చనీయాంశమైంది. రాజధానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా మూడు రాజధానులే తమ ఓటని అసెంబ్లీలోనే ప్రభుత్వం ప్రకటించింది.

    ఇది చదవండి: డ్రెయినేజీలో దూకిన వైసీపీ ఎమ్మెల్యే.. అధికారులకు షాకింగ్ ట్రీట్ మెంట్..


    మరింత సమగ్రమైన బిల్లుతో సభ ముందుకొస్తామని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తారన్న ప్రచారం జరిగినా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ప్రభుత్వమై అమరావతిలో పనులు చేపట్టినందున రాజధాని బిల్లు ఉంటుందా లేదా అనేదానిపై అందరి దృష్టిపడుతోంది. దీంతో వర్షాకాల సమావేశాల్లో రాజధాని అంశం హైలెట్ కాబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.



    ఇక వచ్చే రెండేళ్లు రాష్ట్రం పూర్తిగా ఎన్నికల మోడ్ లోనే ఉండే అవకాశముండటంతో ఈ సమావేశాల్లో పథకాలకు సంబంధించిన చర్చే ఎక్కువగా ఉండే అవకాశముంది. అలాగే మేనిఫెస్టోలో అమలు కాని కొన్ని హామీలకు సంబంధించిన కీలక ప్రకటనలు కూడా వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పెళ్లికానుక, వైఎస్ఆర్ బీమా, పెండింగ్ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్, ఒంటరి మహిళలకు పెన్షన్ నిబంధనలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన రూల్స్ వంటి వాటిపై చర్చ జరిపి సడలింపులిచ్చే విధంగా ప్రకటనలు చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Assembly

    తదుపరి వార్తలు