హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-TS Water War: ప్రధాని వద్దకి నీటి పంచాయతీ... తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సై

AP-TS Water War: ప్రధాని వద్దకి నీటి పంచాయతీ... తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సై

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

తెలుగు రాష్ట్రాల మధ్య జలగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

  తెలుగు రాష్ట్రాల మధ్య జలగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు ఎన్జీటీ కూడా జోక్యం చేసుకొని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలుపగా..డెడ్ స్టోరేజీ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వైఖరి దారణమని.. వెంటనే విద్యుత్ ఉత్పత్తి నిలిపేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు తాము విభజన చట్టం ప్రకారం కృష్ణాజలాలను వినియోగించుకుంటున్నామని.., తమ వాటాలోని నీటినే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నామని వాదిస్తోంది. మరోవైపు తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ అంశంలో కేంద్రం వద్దే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో తెలంగాణ జలజగడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, ఏపీ వినియోగించుకుంటున్న నీటి వాటా అంశాలు, విభజన చట్టం తదితర అంశాల చర్చకు వచ్చాయి.

  తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్న ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయింది. దీనిపై ప్రధాన మంత్రికి, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖరాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఆ రాష్ట్ర మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వైఎస్ ను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అసవరమైతే ఎంతదూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దామని సవాల్ విసిరారు. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదన్న ఆయన.. మా సంయమనం చేతకాని తనం కాదని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోందని ఆరోపించారు.

  ఇది చదవండి: బ్లాక్ రైస్ తో ప్రయోజనాలివే...! ఏపీలో పెరుగుతున్న సాగు..


  అంతకుముందు కేబినెట్ సమావేశంలో జల వివాదం వ్యవహారాన్ని పలువురు మంత్రులు లేవనెత్తగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే ఆలోచిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ప్రభుత్వం అవేశంగా స్పందిస్తే అక్కడున్న మనవాళ్లు ఇభ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్రేలదని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించిన ఆయన.. నీటి అంశంలో ఎలా ముందుకెళ్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచింరారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి తెలంగాణకు లేఖరాయాలని జగన్ స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Krishna River

  ఉత్తమ కథలు