Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT RELEASED NEW GO FOR BARBERS WELFARE NGS

AP Government: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఆ పేర్లతో పిలిస్తే కఠిన శిక్షలు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

 సీఎం జగన్( ఫైల్)

సీఎం జగన్( ఫైల్)

AP Government: సోషల్ ఇంజనీరింగ్ సీఎం జగన్ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. పదవుల పంపాల విషయమైనా.. మంత్రి వర్గ కూర్పు అయినా.. సామాజీక సమీకరణాలకే ఆయన పెద్ద పీట వేస్తారు.. అందుకే ఆయా కులాల్ని ఆనందపరుస్తూ ప్రత్యేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా మరో సామాజిక వర్గానికి గుడ్ న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. సామాజీక వర్గాలుగా ఓటర్లను ఆకర్షించడపై నిత్యం ఫోకస్ చేస్తారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో కుల సమీకరణాల్నిసరిగ్గా లెక్కించి.. ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా.. ఆయా కులాల్ని సంతృప్తి పరిచేందుకు కులాల వారీగా కొత్త కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు నామినేటెడ్ పోస్టుల.. స్థానిక ఎన్నికల్లో సీట్లు.. మంత్రి వర్గ కూర్పు ఇలా ప్రతి విషయంలో లెక్క తప్పకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు కులాల ఓటర్లను ఆకర్షించే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో మరో తాజా నిర్ణయం తీసుకున్నారు. దానికి సబంధించి జీవోనే జారీ చేశారు.

  ఏపీ వ్యాప్తంగా సొంతంగా సెలూన్లు నడుపుకుంటున్న నాయీ బ్రహ్మణులకు ఇప్పటికే ఏడాదికి పది వేల రూపాయల సాయం అందిస్తున్నారు. దీంతో తమ ఖర్చులు కొంత వరకు ఒడ్డెక్కుతున్నాయని.. ఆయా సామాజిక వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న వాదన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై వారంతా సమాజంలో మిగతా వారితో పాటు ఆత్మగౌరవంగా జీవించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే నాయీ బ్రహ్మణుల్ని ఇప్పటికే సమాజంలో పలు పదాలతో జనం పిలుస్తున్నారు. వాటిని ఇకపై నిషేధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా.. కార్యరూపం దాల్చలేదు.. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజా జగన్ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం ఇకపై నాయీ బ్రహ్మణుల్ని మంగలి, మంగలోడ, బొచ్చగొరిగావాడా, మంగలిది, కొండమంగలి అనే పదాలతో పిలవకూడదిని జీవోలో పేర్కొన్నారు. 

  ఇదీ చదవండి : అక్కాచెల్లెళ్లకు లోకేష్ కానుక ఇదే.. కారు కొనాలంటే బ్రాహ్మణి ఫైనాన్స్ చేయాలా..

  ఈ పదాల వాడకాన్ని నిషేధిస్తూ జీవోలో స్పష్టం చేశారు. కేవలం నిషేధించామని చెప్పడమే కాదు.. ఈ పదాలతో వారిని ఎవరైనా పిలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. ఆగస్టు 7నే విడుదల చేసిన ఈ ఉత్తర్వులు తాజాగా వెలుగుచూశాయి. ఇప్పటికే చింతామణి నాటకం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, రచ్చకావడం నేపథ్యంలో ఈ ఉత్తర్వుల్ని ప్రభుత్వం గుట్టుగా విడుదల చేసినట్లు సమాచారం.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కు రాఖీలు కట్టిన మహిళా నేతలు.. కనిపించని మంత్రి రోజా.. పుష్ప శ్రీవాణి!

  కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు