హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Three Capitals: అసెంబ్లీ ముందుకు మరోసారి మూడు రాజధానుల బిల్లు.. విశాఖ నుంచే పాలన.. మంత్రి ఏమన్నారంటే?

Three Capitals: అసెంబ్లీ ముందుకు మరోసారి మూడు రాజధానుల బిల్లు.. విశాఖ నుంచే పాలన.. మంత్రి ఏమన్నారంటే?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Three Capitals: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లును వెనక్కు తీసుకుంది. దీంతో అది ముగిసిన కథే అనుకున్నారంతా..? కానీ మళ్లీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందా..? తాజాగా మంత్రి గుడివాడ వ్యాఖ్యల అర్థం ఏంటి..?

ఇంకా చదవండి ...

  Three Capitals: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని మరోసారి మూడు రాజధానుల (Three Capital) అంశం తెరపైకి వచ్చింది..? మూడు రాజధానుల వ్యవహారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముందుకే వెళ్లాలని భావిస్తున్నారా. త్వరలో రాజధానుల బిల్లు ఏపీ అసెంబ్లీ (AP Assembly) ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారా..? ఇటీవల వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్న జరిగిన ప్లనరీ వేదికగా ఎంపీ నందిగం సురేష్ (MP Nandigam Suresh).. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ (Minster Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకొచ్చారు. ఆ బిల్లులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని (Capital Amaravati) ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు.. న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరోవైపు అసెంబ్లీ ముందు మూడు రాజధానుల బిల్లు పాసైనా.. మండలిలో రభసకు కారణమైంది. ఆ తరువాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. కానీ న్యాయస్థానాల రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వం తీరును తప్పు పట్టి.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

  దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనూహ్యంగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుతో పాటుగా.. సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. కానీ బిల్లు ఉపసంహరణ సమయంలో సభలోనే సీఎం జగన్ ఈ బిల్లులను మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 

  గత మార్చిలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. నిర్మాణాలను పూర్తి చేయటానికి సమయం నిర్దేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. కోర్టు నిర్దేశించిన నిర్మాణాల సమయం మాత్రం ఆరు నెలలు కాదు.. అరవై నెలలు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి కాని నిర్మాణాలను ప్రారంభించింది. హైకోర్టు తీర్పు అమలు దిశగా బ్యాంకుల రుణాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి పరిధిలోని కొన్ని భూముల అమ్మకానికి నిర్ణయించింది.

  ఇదీ చదవండి : ఉప్పొంగుతోన్న తుంగభద్ర.. మంత్రాలయం దగ్గర భక్తులకు ఆంక్షలు

  వాస్తవ పరిస్థితులను చూస్తే.. ఎన్నికల వరకూ మూడు రాజధానులు సాధ్యం కాదనే రాజకీయంగా అభిప్రాయం ఉంది. ఈ సమయంలోనే వైసీపీ నేతలు మరోసారి మూడు రాజధానుల బిల్లు అంశం పై చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మొన్న ప్లీనరీ ఎంపీ నందిగం సురేష్ ఏపీకి మూడు రాజధానులు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. తాజాగా ఏపీ మంత్రి అమర్నాద్ విశాఖ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.

  ఇదీ చదవండి : భక్తులకు శుభవార్త.. ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. టికెట్ ధర ఎంతంటే..?

  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని.. మరో 2, 3 నెలల్లో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేసారు. స్వయంగా మంత్రి.. అది కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు ఉన్న మంత్రి.. అందులోనూ విశాఖకు చెందిన మంత్రి కావడంతో.. మరోసారి మూడు రాజధానులపై ప్రభుత్వం ఫోకస్ చేసిందా అనే అంశం తెరైపైకి వచ్చింది. అందుకే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ కు వెళ్లకుండా.. ఒక వైపు తీర్పు అమలు దిశగా అడుగులు వేస్తూ.. మరోసారి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టటం సాధ్యమేనా.. న్యాయ పరంగా చిక్కులు రావా అనే చర్చ మొదలైంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam

  ఉత్తమ కథలు