Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT INTRODUCE NEW APP FOR SCHOOLS TO ATTENDANCE NGS

AP Schools: ఏపీలోని స్కూల్స్ లో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. టీచర్లకు.. స్టూడెంట్స్ కూ మొబైల యాప్..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

AP Schools: ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది.. నాడు నేడు పేరుతో నిధులు విడుదల చేసింది. ఇక ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేసింది. ఇప్పుడు మరో ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇంకా చదవండి ...
    AP Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యాసంస్కరణలు చేపడుతూ కొత్త పంథాలో వెల్తోంది జగన్ సర్కార్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల్లో (Government School) మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే పలు ప్రయోగాలు చేసింది. నాడు నేడు పేరుతో బిల్డింగ్ ల రూపు రేఖలు మార్చింది. ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేసింది. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడి (Ammavodi) తో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు మస్ట్ గా హాజరు అయ్యేలా చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా యాప్ ల సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి తీసుకొచ్చేర ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం (AP Government) అధికారంలోకి వచ్చాక స్కూళ్లలో పలు సంస్కరణలకు తెరదీసింది. స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కోట్ల రూపాయల వ్యయంతో నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్ధులను భారీగా స్కూళ్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేస్తోంది.దీంతో పాటు వారి హాజరును కచ్చితంగా నమోదు చేసేందుకు దారులు వెతుకుతోంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఢానం సాయం తీసుకుంటోంది.

    ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లలో టీచర్లకు ఇకపై హాజరు నమోదుకు మొబైల్ యాప్ లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నాలుగు రకాల యాప్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టులా వీటి ప్రయోగం ప్రారంభమైంది. ఇక నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో, ఎల్లుండి నుంచి అనంతరపురంలో, ఏప్రిల్ 1 నుంచి ప్రకాశంలో ఈ యాప్ లను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఆయా స్కూల్స్ లో వచ్చే ఫలితాల ఆధారంగానే ఇతక పాఠశాలల్లో కూడా ఈ యాప్ ను అమలు చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

    ఇదీ చదవండి: రోజాకు అధినేత ఇచ్చిన ఆదేశాలేంటీ? అందుకే ఆమె ఆ ప‌ని చేసిందా?

    టీచర్లకు ఇచ్చే మొబైల్ యాప్ ద్వారా టీచర్లతో పాటు విద్యార్ధుల హాజరు కూడా నమోదు చేయబోతున్నారు. ఇప్పటి వరకూ మ్యాన్యవల్ గా అటెండెన్స్ రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై మాత్రం యాప్ ల ద్వారా వీరి హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ యాప్ లను స్కూల్లో ఓపెన్ చేసి హాజరు నమోదు చేస్తేనే.. వారు స్కూలుకు వచ్చినట్టు పరిగణించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా టీచర్లు ఇంటి దగ్గరే ఉండి హాజరు నమోదు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. టీచర్లు తమ మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా విద్యార్ధుల ఫోటోలు తీసి ఓసారి అప్ లోడ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి వారిని రోజూ ఫేస్ మాస్కింగ్ ద్వారా హాజరు నమోదు చేస్తారు.

    ఇదీ చదవండి: ఎన్టీఆర్ దేవుడైతే.. చంద్రబాబు రాముడు.. ఎత్తర జెండా అంటూ లోకేష్ ట్వీట్

    ప్రస్తుతం వివిధ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ యాప్ లను అధికారులు పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అంటే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ యాప్ ల ద్వారా ఈ-హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో టీచర్లు, విద్యార్ధులు సకాలంలో స్కూళ్లకు రావడం, అక్కడ ఎంత సేపు ఉంటున్నారనే అంశాలను ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు