AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT FOCUS ON LAND SURVEY IN SAFE RECORDS CM REVIEW WITH OFFICIALS NGS GNT
CM Jagan: ఏపీ ప్రజలకు సీఎం శుభవార్త.. సమగ్ర భూ సర్వేతో దేశానికి రాష్ట్రం దిక్సూచి కావాలన్న జగన్
ఏపీ సీఎం జగన్
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇకపై భమూలకు సంబంధించి ఎవ్వరూ మార్చలేని విధంగా.. టాంపర్ చేయలేని విధంగా చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ పద్దతుల్లోనే కాకుండా.. ఫిజికల్ రికార్డులు కూడా తరయారు చేయాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థ ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) శుభవార్త చెప్పారు. శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా కీలక ఆదేశాలు చేశారు. గతంలో వెబ్‌ల్యాండ్ (Web Land) లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలి అన్నారు. అలాగే రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్ చేయలేని విధంగా చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని సూచించారు. ఈ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలని కోరారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా (No Corruption) చేయాలని.. లంచాలకు తావులేకుండా ఈ వ్యవస్థ నడవాలన్నదే తన లక్ష్యం అన్నారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని.. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.
సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ
సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని స్పష్టం చేశారు. వేగవంతంగా పనులు చేయడానికి మరో 20
డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే
జరిగేలా చూడాలన్న అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
చేసినట్లు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న
అధికారులు.
సమగ్ర భూ సర్వే కోసం ఆయన చెప్పిన సూచలు ఇవే..
1. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి
2. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి
3. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికే వివాదాలు ఉండకూడదు
4. న్యాయశాఖను కూడా ప్రక్రియలో భాగమవ్వాలి
5. దీనిపై సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను రెడీ అవ్వాలి
6. దేశానికి ఆంధ్రప్రదేశ్ లోని భూ సర్వే ఓ దిక్సూచి కావాలి
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.