హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-TS Water War: తెలంగాణ వైఖరి రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం కోర్టులో ఏపీ పిటిషన్

AP-TS Water War: తెలంగాణ వైఖరి రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం కోర్టులో ఏపీ పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తారాస్థాయికి చేరింది. కృష్ణాజలాల పంచాయతీ సుప్రం కోర్టు వరకు వెళ్లింది.

  తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తారాస్థాయికి చేరింది. కృష్ణాజలాల పంచాయతీ సుప్రం కోర్టు వరకు వెళ్లింది. నీటి వాటాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్ధంగా రావాల్సిన నీటివాటను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. వారి తీరుతో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. ఇది ఏపీ ప్రజల హక్కును హరించేలా ఉందన్నారు. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. కృష్ణారివర్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణపై ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రి లేఖలు రాసిన ఏపీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో వాటర్ వార్ మరింత ముదిరింది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీతో పాటు ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేసింది.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం మరో ఘనత.. దేశంలోనే జగన్ సర్కార్ టాప్..


  ఇప్పటికే ఈ విషయంలో రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నీటి వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల లోపు నీరున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా తరలించడమే కాకుండా.. విద్యుత్ ఉత్పత్తు కూడా చేసుకుంటోందని.. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను వాడుకుంటే తప్పేంటని జగన్ బహిరంగంగానే ప్రశ్నించారు.

  ఇది చదవండి: ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు... ఆనందయ్య సంచలన ప్రకటన...


  రాష్ట్ర విభజన తర్వాత 2015 జూన్ 19వ తేదీన ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయని... ఆ ఒప్పందం ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు మొత్తం 811 టీఎంసీలు కేటాయించారని జగన్ గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 881 అడుగులకు చేరితే తప్ప రాయలసీమకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గత 20 ఏళ్లలో శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగలకు చేరుకున్న సందర్భాలు 20-25 రోజులు కూడా లేవన్నారు. 881 అడుగుల నీరు లేనప్పుడు సీమకు నీరు ఎలా ఇస్తామని జగన్ ప్రశ్నించారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులకు 800 అడుగుల లోపే నీరు తీసుకుంటున్నారని.., 796 అడుగుల నీటి మట్టంతోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించరు. 800 అడుగుల లోపు నీటిని తెలంగాణ వాడుకుంటే తప్పులేదుగానీ.. 881 అడుగులలోపు రాయలసీమకు నీరు వాడుకుంటే తప్పేముందని సీఎం జగన్ ప్రశ్నించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Krishna River, Supreme Court

  ఉత్తమ కథలు