Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT FACT CHECK GAVE REPLY ON TWITTER ALLEGED BY JANASENA CHIEF PAWAN KALYAN NGS GNT

Fact Check: జనసేన పవన్ ఆరోపణలపై ప్రభుత్వం క్లారిటీ.. వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా ఆరోపణలపై ఏమన్నారంటే..?

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Fact Check: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, జనసేన మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరిస్థితి వేడెక్కింది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమాయకుల ఇళ్ల స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
    Fact Check: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ (YCP), టీడీపీ (TDP) గా ఉన్న వారులో జనసేన (Janasena) సైతం ఎంటర్ అయ్యింది. ఇప్పుడు అధికార పార్టీ నేతలు.. జనసేనపైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో జనసేన కూడా కౌంటర్లు ఇస్తోంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) తో పోలిస్తే.. అంశాల వారీగా జనసేన.. ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. అలాగే ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియచేయాలనే లక్ష్యంతో ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనవాణి (Janavani) అనే కార్యక్రమం ప్రారంభించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ సమస్యలు తెసులుకోవడానికి రావడంతో భారీగా ప్రజా స్పందన కనిపిస్తోంది. వేలాదిగా వచ్చి ఆర్జీలు ఇస్తున్నారు. తమ సమస్యలను జనసేన అధినేతకు విన్నవించుకుంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ నేతల ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదులు చేస్తారు. తాజాగా ఆదివారం రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏళ్ల తరబడి పలు సమస్యలు ఎదుర్కొంటున్న వారు పవన్‌కు సమస్యలను విన్నవించారు.

    ప్రజల నుంచి స్వీకరించిన సందర్భంగా వైసీపీ నేతలపై పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. వైసీపీ నేతలు సామాన్య ప్రజలను బతకనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు చాలామంది.. ఓట్లు వేసి గెలిపించిన అమాయకుల ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జాపై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



    తాజాగా జనసేన చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చింది. అందుకు సంబంధిన ఓ నోటిసును ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రభుత్వం ఫ్యాక్‌ చెక్‌ ద్వారా పూర్తి వివరాలను అందించింది. 2004లో ప్లాట్‌నెంబర్‌ 2400లో తిరుపతి అర్బన్‌ మండలానికి చెందిన అర్హులైన లబ్దిదారులకు 6700 ఇళ్ల స్థలాలను మంజూరు చేసినట్లు తెలిపింది. 2018లో మంజూరైన వాటిలో 989 స్థలాలను అప్పటి తహసీల్దార్‌ రద్దు చేశారని, అందులో పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేసిన ప్లాట్‌ నెంబర్‌ 2400లోని స్థలం కూడా ఉన్నట్లు తెలిపింది.

    పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం కాదని ఆ పోస్టులో పేర్కొంది. ఎలాంటి భూ కబ్జా జరగలేదని ట్విట్టర్‌లో ఫ్యాక్‌చెక్‌ ద్వారా వివరణ ఇచ్చుకుంది ప్రభుత్వం. ఈ మేరకు జనసేన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో భూకబ్జాపై చేసిన పోస్టును సైతం ప్రభుత్వం అటాచ్‌ చేస్తూ ఈ ట్వీట్‌ చేసింది. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, Fact Check, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు