Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES READY FIGHT WITH GOVERNMENT ON GPS FUNDS ISSUE NGS

GPF Fight: ఏపీ సర్కార్ జీపీఎస్ షాక్ తప్పద.. కేంద్రం ప్రకటనతో ఉద్యోగుల్లో ఆందోళన.. మరో పోరాటానికి రెడీ..?

 జీపీఎస్ నిధుల వాడకంపై ఉద్యోగులు గరం గరం

జీపీఎస్ నిధుల వాడకంపై ఉద్యోగులు గరం గరం

GPF Fight: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో రగిలిపోతున్నారు. జీపీఎస్ సర్కార్ చెప్పిన ఫార్ములాను వ్యతిరేకిస్తున్నారు. ఆ నిధులను సైతం ప్రభుత్వం వాడేసిందనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. తాజాగా కేంద్ర నిర్ధారించడంతో.. మరోసారి ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    GPF Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగుల (Government Employees) PF నిధులపై జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఆ నిధులను జగన్‌ సర్కార్‌ (Andhra Pradesh Government) కాజేసినట్లు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే (Central Government) లోక్ సభలో ప్రకటించింది. సోమవారం టీడీపీ విజయవాడ (Vijaywada) ఎంపీ  కేశినేని నాని (MP Kesineni Nani) GPF నిధులపై ప్రశ్నించారు. ఆయన ఏమడిగారంటే..? ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా.. కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా.. జిపిఏఫ్ ఖాతాల నుండి 2021-2022 సంవత్సరాల్లో జిపిఏఫ్ సొమ్ము రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సమ్మతితోనే విత్ డ్రా చేసిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని నాని ప్రశ్నించారు. కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు.

    2021, 2022 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి 68020 జిపిఏఫ్ ఖాతాలలో అంతకు మునుపు జమ చేసిన డిఎ మొత్తం నుండి 413.73 కోట్లు డిఎ బకాయిలు విత్ డ్రా చేశారని సమాధానం ఇచ్చారు. ఇంతకాలం ఇదే అంశంపై విపక్షాలు.. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదని వైసీపీ నేతలు కొట్టి పారేస్తూ వచ్చారు.. కానీ తాజా కేంద్రం ప్రభుత్వమే నిధుల మళ్లింపును నిర్ధారించింది.



    తాజాగా కేంద్రం ప్రకటనపై మరోసారి ఆందోళనకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రెండు వారాల క్రితం.. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలతో ప్రభుత్వం ఉప సంఘం చర్చలు జరిపింది. సీపీఎస్ రద్దు - ప్రభుత్వం ఉద్యోగుల తరపున వాటా సొమ్ముల పైన రుణాలు తీసుకుంటుందనే అంశాల వేదికగా ఈ చర్చలకు జరిగాయి. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాకముందే.. ఇఫ్పుడు జీపీఎఫ్ నిధుల మళ్లింపు దుమారం రేపుతోంది.

    ఇదీ చదవండి : చంద్రబాబుతో అసలు ప్రధాని ఏమన్నారంటే..? మా అధినేతే నెంబర్ వన్ అన్న విజయసాయి

    చాలా రోజుల నుంచి ప్రభుత్వం తీరుపై విపక్షలు.. అటు కొన్ని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి కొత్త రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి పొందిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆ రుణాలను ప్రభత్వం వాడేసుకుందని అప్పట్లోనే విపక్షాలు ఆరోపించినా.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.. అదే అనుమానంతో ఎంపీ కేశినేని నాని కేంద్రాన్ని ప్రశ్నించగా.. దాన్ని కేంద్రం నిర్ధారించింది.

    ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ..? కారణం ఇదేనా..?

    తాజా పరిణామాలపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.. ఇప్పటికే పీర్సీపై కొన్ని ఉద్యోగసంఘాలు అసహనంతో ఉన్నాయి. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు సీపీఎస్ రద్దే తమ ప్రధాన డిమాండ్ అనే పదే పదే చెబుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు జీపీఎఫ్ నగదు.. ఉద్యోగులకు తెలియకుండానే వాడిసేరానే వాదన నిజమని తెలియడం.. మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యే దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.. ముఖ్యంగా త్వరగా సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్ తో మళ్లీ రోడ్డెక్కే అవకాశం ఉంది.
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు