Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH EX MINSTER TDP LEADER NARAYANA ARRESTED BY AP CID POLICE IN HYDERABAD NGS GNT

Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

Ex Minster Narayana: తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండగా.. ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.. కారణం ఏంతో తెలుసా..?

    Ex Minster Narayana Arrest:  మాజీ మంత్రి, సీనియిర్ టీడీపీ నేత నారయణను (Ex Minster Narayana) పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్  (Hyderabad)లోని  కొండాపూర్ లో అతడి నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police).. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల పదో తరగతి పబ్లిక్ పేపర్ల లీకేజ్ (AP 10th Class Paper Leakage) విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో నారాయణ ఎస్వీ బ్రాంచ్ (Narayna SV Branch) నుంచి తెలుగు పేపర్ లీక్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు చెందిన గిరిధిర్ (Giridhar) అనే వ్యక్తి వాట్సప్ నుంచి పేపర్ లీకైనట్టు గుర్తించారు. ఈ విషయంలోనే నారాయణ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలించి.. అక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయం వుందని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్రపై పోలీసులు కొన్ని రోజుల నుంచి ఫోకస్ పెట్టారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌ నుంచే తెలుగు పేపర్ (Telugu Paper) వెలుగులోకి వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. అలాగే నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర వుందని అనుమానిస్తున్నారు. ఉదయం పరీక్ష ప్రారంభమయిన వెంటనే గిరిధర్ వాట్సప్ నెంబర్ నుంచి బయటకు వెళ్ళింది తెలుగు ప్రశ్నా పత్రం.

    ఇదీ చదవండి : అమ్మవారి సన్నిధిలో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు

    పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఉదయం 9.57కి ప్రశ్నాపత్రం లీకైంది. చిత్తూరుతో పాటు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో  సైతం పదో తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారం కలకలం రేపింది. ఇటీవల సీఎం జగన్ సైతం దీనిపై ఘాటుగా స్పందించారు.. పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ చేసింది.. నారాయణ, చైతన్యా విద్యాసంస్థలే అని ఆరోపించారు.. వారే పేపర్ లీక్ చేసి.. దొంగే దొంగ అన్నట్టు వ్యవహారం ఉంది అన్నారు. అలాగే నారాయణ సంస్థల అధినేత ఎవరు.. చంద్రబాబుకు సన్నిహితుడని.. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని జగన్ గుర్తు చేశారు. వారే పేపర్లు లీక్ చేసి.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : ఏపీలో అమ్మకానికి జనసేన ఆఫీస్.. ధర ఎంతో తెలుసా? ఇదిగో ఫ్రూఫ్..!

    అయితే పేపర్ లీకేజ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తినా.. విద్యాశాఖ మంత్రి మాత్రం అలాంటిది ఏదీ జరగలేదు అంటూ చెప్పుకొచ్చారు.. కానీ స్వయంగా సీఎం జగన్ మాత్రం పేపర్ లీకేజ్ వ్యవహారం నిజమే అంటూ.,. ఎవరు లీక్ చేశారో పేర్లు కూడా బయట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స  ఇరాకాటంలో పడ్డారు.. అయితే  ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన తర్వాత సీఐడీ దూకుడు పెంచింది.

    ఇదీ చదవండి : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? పొత్తులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఆయనేమన్నారంటే..?

    ఇప్పటికే ఈ కేసులో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాటు.. మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి అంటే.. గత నాలుగు రోజులుగా నారాయణ ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఙాతంలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన్ను చిత్తూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, AP News, Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు