Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH EX CM TDP CHIEF CHANDRABABU NAIDU TAKE KEY DECISION HE BUILT HOUSE IN KUPPAM NGS

Chandrababu: మార్పు మంచికేనా..? లేక భయపడ్డారా..? జూన్ 15న చంద్రబాబు కీలక నిర్ణయం

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మారిపోయారా..? లేక వరుస తగిలిన దెబ్బలకు భయపడ్డారా..? కుప్పంలో ఓడిపోవాల్సి ఉంటుందనే సిగ్నల్స్ అందాయా..? లేక సైకిల్ కు రిపేరు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? అందుకు జూన్ 15న ముహూర్తం ఫిక్స్ చేశారు..?

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ  (Telugu Desam Party)అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu).. పూర్తిగా మారిపోయారా..? గతానికి భిన్నంగా ఈ సారి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఎన్నికల సమయంలోనూ కుప్పం (Kuppam) వైపు చూడని ఆయన.. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సొంత నియోజకవర్గంపై ఫోకస్ ఎందుకు చేస్తన్నారా..? సాధారణంగా కుప్పం అంటే చంద్రబాబు అడ్డా. అక్కడ ఆయనకు పోటీ లేదు.. సుమారు 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం (Kuppam) ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. కానీ ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు షాక్ ఇచ్చాయి. దీంతో సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తగిలిన షాక్‌తో.. ఇప్పటి నుంచే కుప్పంలో సైకిల్‌కు రిపేర్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు.. త్వరలోనే అక్కడ సొంతిల్లు కూడా నిర్మించుకోబోతున్నారట. ఇంతలా.. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టడానికి రీజనేంటి? కుప్పం.. బాబులో టెన్షన్ పుట్టిస్తోందా?

  కుప్పం లోకల్ బాడీ ఎలక్షన్స్‌ (Local Body Elections)లో వచ్చి రిజల్ట్‌తో చంద్రబాబు అలర్ట్ అయ్యారు అంటున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకోకపోతే.. తన సీటుకే ఎసరొస్తుందని ఆయన భావిస్తున్నారనే ప్రచారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి కూడా కుప్పంపై నిత్యం ఫోకస్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ కూడా అప్పుడప్పుడు కుప్పం ప్రస్తావన తీసుకొస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడ్ని తన సొంత నియోజకవర్గంలో ఓడిపోతున్నారనే ప్రచారం చేయగలిగితే అ ప్రభావం మొత్తం టీడీపీపై ఉంటుందని.. ఇక కుప్పలంలో గెలిస్తే.. ఇక చంద్రబాబుకు రాజకీయ జీవితం తెరపడుతుంది అన్నది వైసీపీ ప్లాన్ (YCP Plan).. అందుకే అన్ని వ్యూహాలకు వైసీపీ పదును పెడుతోంది.

  ఇదీ చదవండి : పొత్తులైనా పెట్టుకొండి.. పెళ్లైనా చేసుకొండి..? మాకు అభ్యంతరం లేదంటున్న మాజీ మంత్రి

  వైసీపీ వ్యూహాలను తిప్పి కొట్టాలి అంటే.. స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయడం బెటరని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. అందుకే తన సొంత నియోజకవర్గం నుంచే సైకిల్ కు రిపేర్ చేయాలని నిర్ణయించారు. గ్రౌండ్ లెవెల్ నుంచి మరోసారి తెలుగుదేశం బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఏళ్ల తరబడి కుప్పం టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లను నమ్ముకోకుండా.. తానే రంగంలోకి దిగారు. పార్టీ కార్యకర్తలతో.. చంద్రబాబే నేరుగా మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కుప్పంలో తాను అనుకున్నంతగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నది చంద్రబాబు దగ్గర ఉన్నసమాచారం అని తెలుస్తోంది. విద్యుత్ కోతలకు నిరసనగా జనం రోడ్డెక్కినా.. లోకల్ కేడర్ ఈ ఇష్యూను అందిపుచ్చుకోలేదన్న టాక్ ఉంది. పైగా.. అక్కడున్న తెలుగుదేశం నాయకులు నిరసనలతో సరిపెడుతున్నారు తప్ప.. పార్టీ బలోపేతం కోసం పని చేయడం లేదని భావిస్తున్నారు. తానే వచ్చి పరిశీలిస్తే తప్ప.. కుప్పంలో క్వారీ మాఫియా బండారం బయటపడలేదని.. ఈ వ్యవహారాన్ని లోకల్ కేడర్ రాజకీయంగా సరిగ్గా వాడుకోలేదన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకే నేరుగా రంగంలోకి దిగి.. కుప్పం టీడీపీలో కొత్త ఉత్తేజం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  ఇదీ చదవండి : మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు..! కోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్

  ఇందులో భాగంగా కుప్పంలో సొంతగా ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచారు.. అయినా.. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు లేదు. దీంతో ఇప్పుడు ఇల్లు కట్టుకోడానికి సిద్ధమయ్యారు. స్థలానికి సంబంధించి ఈ నెలం 29న రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు. అలాగే జూన్ 15న ఆ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

  ఇదీ చదవండి : : సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చి ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై.. ఏం జరిగిందంటే?

  అయితే వైసీపీని చూసి భయపడడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ సైతం ఇవాళ అదే మాట చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఆధరణ చూసి.. సొంత నియోజకవర్గంలో ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు.. ఇప్పుడు తన నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటున్నారని జగన్ ఆరోపించారు.. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా.. చంద్రబాబు ఈ కొత్త నిర్ణయం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు