హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Employees: సర్కార్ పై సమరానికి సై అన్న ఉద్యోగ సంఘాలు.. ఈ నెల తొమ్మిది నుంచి తగ్గేదేలే అంటూ వార్నింగ్

AP Employees: సర్కార్ పై సమరానికి సై అన్న ఉద్యోగ సంఘాలు.. ఈ నెల తొమ్మిది నుంచి తగ్గేదేలే అంటూ వార్నింగ్

మళ్లీ సమరానికి సై అంటున్న ఉద్యోగులు

మళ్లీ సమరానికి సై అంటున్న ఉద్యోగులు

AP Employees: ఏపీలో మరో భారీ ఉద్యమం తప్పదా..? ఈ సారి వెనక్కు తగ్గ కూడదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఫిక్స్ అయ్యాయా..? ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి దశల వారీ ఉద్యమానికి సిద్ధమైన .. ఉద్యోగల భవిష్యత్తు ప్రణాళిక ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

AP Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వర్సెస్ ఉద్యోగుల (AP Employees) వార్ మరింత ముదిరేలా ఉంది. ఈనెల 9వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యోగుల ఉదమం ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తాజాగా స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు.. అమలు కాకపోవడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యమానికి సిద్ధమయ్యామని ప్రకటించారు. ఇది అందరి ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన అని ఏపీ జేఏసీ నేతలు అన్నారు. కర్నూలు కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు.

జీతాభత్యాల కోసం ఎదురుచూస్తూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని అప్పుల వాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కనీసం జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉద్యోగులకు సందిగ్ధం నెలకొందన్నారు. మందుల బిళ్లలు అయిపోయి ప్రతి రోజూ పెన్షన్ డబ్బులు పడ్డాయో, లేదో అని కళ్లలో వత్తులు వేసుకుని విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

అసలు ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఏమవుతోంది? ఎక్కడికి పోతోంది? ఎందుకు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అరియర్స్, డీఏ బకాయిలు, కొత్త డీఏ, లీవ్ ఎస్ క్యాష్ మెంట్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. వీటిపై లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ముందుగా ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమమై కదులుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : భార్యతో ఎఫైర్.. భర్త ఫేస్ బుక్ లో ఆ కామెంట్ చేశాడని.. ఎంత పనిచేశాడంటే..?

ఇది ఉద్యోగుల ఆత్మ గౌరవ ఉద్యమమని స్పష్టం చేశారు. కడుపు నిండి కాదని, కడుపు మండి ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని, ఈ కారణంగా ప్రజలెవరైనా ఇబ్బందులు పడితే.. అది ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఉద్యోగి ఉద్యమ జెండా పట్టుకుని హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాంగంటి.. కారణం ఇదే..

ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనల షెడ్యూల్ ఇదే..

9వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసన

మార్చి 13,14 తేదీల్లో జిల్లా కలెక్టరెట్‌లు, ఆర్డీవో ఆఫీస్‌ల ముందు లంచ్ బ్రేక్‌లో ఆందోళనలు

మార్చి 15,17,20 తేదీల్లో అన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జేఏసీలోని అన్నీ ఉద్యోగ సంఘాలతో ధర్నాలు

మార్చి 21 నుంచి వర్క్‌ టు రూల్ (ఉ.10.30నుంచి సా.5గంటల వరకే పని)

మార్చి 21న ఉద్యోగుల సెల్ డౌన్,(యాప్‌లతో విధులు నిర్వహిస్తున్నందు ఈతరహా నిరసన)

మార్చి 24న రాష్ట్రంలోని హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్ ఆఫీసుల వద్ద ధర్నా

మార్చి 27న కరోనా సమయంలో, తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుబాలకు భరోసా

ఏప్రిల్‌ 1వ తేదిన ఏప్రిల్‌ ఫూల్‌ డే కాబట్టి (రిటైర్మెంట్, సర్వీస్‌ బెనిఫిట్స్‌పై పోరాటం)

ఏప్రిల్ 3న అన్నీ జిల్లాల్లో ఛలో స్పందన కార్యక్రమాలు.. కలెక్టర్లకు మెమోరండం సమర్పణ

ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలు

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Employees

ఉత్తమ కథలు