Government Teachers: గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ( Government Employees ).. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో అధిక శాతం మంది ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మద్దతు పలికారు.. అందుకు ప్రధాన కారణం అప్పటికే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. అన్నిటికన్నా ముఖ్యంగా సీపీఎస్ (CPS) రద్దు చేస్తానని జగన్ చెప్పడంతో.. మూకుమ్మడిగా అంతా జగన్కు సపోర్ట్ చేశారు.. కానీ జగన్ సీఎం (CM Jagan) అయిన ఏడాది తరువాత ప్రభుత్వ ఉపాధ్యా యులకు.. ప్రభుత్వానికి గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఆ మధ్య పీఆర్సీ వివాదం మరింత దూరం పెంచింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ (PRC) పై ఇతర ఉద్యోగ సంఘాలన్నీ ఆనందం వ్యక్తం చేసినా.. ఉపాధ్యాయ సంఘాలు (Teachers Union) పెదవి విరిచాయి. దానిపై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు సీపీఎస్ రద్దు విషయం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.. దీనికి తోడు.. విద్యావ్యవస్థలో మార్పులు చేయడం.. బయోమెట్రిక్ తప్పని సరి చేయడం.. నాడు నేడు పేరుతో.. సెలవులు చాలావరకు రద్దు చేయడం.. స్కూల్ రికార్డులు అన్నీ ఆల్ లైన్ చేయడం.. ఇలా వివిధ కారణాలతో ఉపాధ్యాయుల పట్ట కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గతంలో కొంతమంది ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర కాపాల పెట్టడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేక పెరగడానికి కారణమైంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తాజా రూపొందిస్తున్న మార్గ దర్శకాలు ఏంటంటే..? విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని, ఈ మార్గంలోనే కొత్త సంస్కరణలను తీసుకొచ్చినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే సబ్జెక్టుల వారీగా బోధనకు ఉపాధ్యాయులను నియమిస్తున్నామని వివరించింది.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే చోట ప్రధాన ఉపాధ్యాయులు ఉండకుండా పూర్తిగా తీసివేస్తున్నారు. వీరి స్థానంలో సీనియర్ ఉపాధ్యాయుడు హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవడం దీని ఉద్ధేశ్యమని చెబుతున్నప్పటికీ..ఉపాధ్యాయులు ఒకరు, ఇద్దరు సెలవు పెడితే తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుందన్నది ఉపాధ్యాయుల వెర్షన్.
ఈ పద్ధతిని తప్పక ఆచరిస్తే.. ఇది ఉపాధ్యాయులపై పని భారం పెంచుతుందని భావిస్తన్నారు. అయితే ఇప్పటికే దీనిపై ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 17 సెక్షన్ల విద్యార్థులకు ఒక్క హిందీ ఉపాధ్యాయుడు మాత్రమే పాఠాలు బోధించాల్సి ఉంటుంది. 19 సెక్షన్లకు మూడు మ్యాథమెటిక్స్, సోషల్ పోస్టులిచ్చింది. దీంతో వారానికి ప్రతి ఉపాధ్యాయుడు 48 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి : హీటెక్కిన గన్నవరం రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో వంశీకి సీటు ఇస్తే అంతే?
అలాగే ఆరవ తరగతి నుంచి 10 తరగతుల్లో 18 సెక్షన్లకు 21 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 3వ తేదీ నుంచి 8 తరగతులకు అసలు ప్రధానోపాధ్యాయుడి పోస్టునే కేటాయించలేదు. రాష్ట్రంలో ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉండే ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్‌ను నియమించనున్నారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 31కి చేరితే రెండో ఎస్జీటీని ఇస్తారు. రాష్ట్రంలో ఎక్కువగా 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలే అధికంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ బడులుగా మారతాయనే భయం ఉపాధ్యాయుల్లో ఉంది. అలాగే 121 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు. 10 మందిలోపు విద్యార్థులు ఉంటే కమిషనర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
కనికరం కూడా లేదా? ట్రాఫిక్ అంతరాయం పేరుతో విచక్షణా రహితంగా దాడి? ఏం జరిగిందంటే?
పోస్టు లేని సమయంలో ఉపాధ్యాయుల్లో జూనియర్ కొత్త పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల్లోనే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు అమలు చేయాలని, మిగతా అన్ని తరగతుల్లోనూ ఒకే మాధ్యమం నిర్వహణ. ఈ లెక్కన 8వ తరగతి వరకు ఒక్క ఆంగ్ల మాధ్యమమే ఉంటుంది. తెలుగు మాధ్యమం లేనట్లే. దీనికి తోడు 3 నుంచి 8 తరగతులు ఉండే ప్రీ హైస్కూల్‌లో 195 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండి, దీనికి మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ లేకపోతే దీన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు.
ఇదీ చదవండి : జనసేన పొత్తు ఆ పార్టీతోనేనా..? క్లారిటీ వచ్చినట్టేనా..? మరి గందరగోళం ఎందుకు?
98 మంది కంటే తక్కువ ఉంటే 30 మందికి ఒకటి చొప్పున ఎస్జీటీలను ఇస్తారు. ఏడో తరగతి వరకు ప్రీ హైస్కూల్‌ను 8వ తరగతి వరకు ఉన్నతీకరిస్తారు. 275 మంది బాలికలు ఉన్న పాఠశాలలో మ్యూజిక్, డ్రాయింగ్, కుట్టుమిషన్ శిక్షణకు ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటు చేస్తారు. ఒకే ప్రాంగణంలో ఉండే 1-10 తరగతులకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. 6-10తరగతులు ఉన్న హైస్కూల్‌లో 93 మందికిపైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టు ఇస్తారు. తాజా మార్గదర్శకాలతో తమ పోస్టులకు ఎక్కడ ఎసరు వస్తుందో అని పీఈటీలు.. ఇతర ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Schools