ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Gowtham Sawang) స్పందించారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Pattabhi) చేసిన కామెంట్స్, టీడీపీ కార్యాలయంపై దాడి (Attack on TDP Office), ఆ తర్వాత జరిగిన పరిణాలపై డీజీపీ వివరణ ఇచ్చారు. విజయవాడ అడ్రస్ తో గుజరాత్ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా విచారణ జరిపి విచారణ జరిపినా కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ అన్నారు. డ్రగ్స్ కేసుపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో మాట్లాడి వివరణ ఇచ్చినా ఏపీ ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ పోర్టులో పట్టుడిన డ్రగ్స్ తో ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని చెప్పినా రాజకీయ ప్రయోజనాలతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్లాన్ ప్రకారమే ఆరోపణలు చేశారని చెప్పారు.
ఇక టీడీపీ నేత పట్టాభి చేసిన కామెంట్స్ దారుణంగా ఉన్నాయని.., రాజ్యాంగబద్ధమైన పదవిలో ముఖ్యమంత్రిపై ఓ పార్టీ కార్యాలయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించినందున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు పొరబాటున నోరు జారి అన్నవి కావని.. కావలనే పదేపదే అలా మాట్లాడరన్నారు. పట్టాభి వాడిన భాష గతంలో ఎప్పుడూ చూడలేదని డీజీపీ అన్నారు.
చంద్రబాబు ఫోన్ కాల్ పై వివరణ..
ఇక తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదన్న చంద్రబాబు ఆరోపణలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంగళవారం సాయంత్రం 7గంటల 3 నిముషాలకు గుర్తుతెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తాను పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నానని.., పోలీస్ బ్యాండ్ దగ్గర ఉండటంతో సౌండ్ వల్ల సరిగా వినిపించడం లేదని.. తర్వాత మాట్లాతానని ఫోన్ పెట్టేశానినట్లు వివరించారు. పోలీసులు స్పందించలేదన్న దానిలో నిజం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులు స్పందించారని సవాంగ్ స్పష్టం చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న గౌతమ్ సవాంగ్.. దీనిపై ఏపీ-తెలంగాణ పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్ మెంట్ పై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని సవాంగ్ అన్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఘటన జరిగిన తర్వాత అక్కడికి వచ్చి సీఐ నాయక్ పై దాడి చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో కేసులో ఏ-1గా లోకేష్, ఏ-2గా అశోక్ బాబు, ఏ-3 ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రావణ్ కుమార్ ను చేర్చారు. వీరిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 70మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, Damodar Goutam Sawang, TDP