Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH DEPUTY CM PIDIKA RAJANNA DORA FIRE ON VOLUNTEER IN GADAPA GADAPAKU PRABUTWAM NGS VZM

AP Deputy CM: పథకం సీఎంది.. పేరు వాళ్లదా..? ఇకపై ఆ పేరు వినపడకూదని అధికారులకు డిప్యూటీ సీఎం వార్నింగ్..?

వాలంటీర్లపై డిప్యూటీ సీఎం ఫైర్

వాలంటీర్లపై డిప్యూటీ సీఎం ఫైర్

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సీఎంగా ముద్ర వేసుకున్నారు.. కరోనా సయయంలో భారీగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. క్రమం తప్పకుండా ఆ పథకాలకు నిధులు జమ చేస్తున్నారు.. ఇలా పథకాల కోసం సీఎం అంత కష్టపడుతంటే.. క్రెడిట్ మాత్రం వేరే వారు తీసుకుంటున్నారా..? తాజగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనకు ఎదురైన అనుభవం షాక్ అయ్యారు. ఇకపై నుంచి వారి పేరు వినపడితే ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిదంటే..?

ఇంకా చదవండి ...
  AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ (Election Heat) కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఇక జనంలోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Prabutwam)పేరుతో ఇంటింటికీ వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు.. ముఖ్యంగా ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి.? అందరికీ అందుతున్నాయా లేదా..? ప్రభుత్వ పాలనపై జనం నాడి ఏంటి తెలుసుకోవడం.. ఎక్కడైనా కాస్త వ్యతిరేకత ఉంటే.. సమస్యలు పరిష్కరించి ఆ వ్యతిరేకత పోగొట్టేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటికే చాలా చోట్లో జనం నుంచి ప్రశ్నల వర్షం ఎదుర్కోవలసి వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ప్రజలు నిలదీసే పరిస్థితి ఉంది. అయితే ఇతరుల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. సీఎం జగన్ ఏరి కోరి.. ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తమ విజయానికి ఈ వాలంటీర్లదే ప్రధాన పాత్ర అవుతుందని సీఎం జగన్ హోప్ప్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఇబ్బందిగా మారబోతోందా.. తాజాగా డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర (Depurty CM Pidika Rajannadora) అయితే.. వాలంటీర్ అన్న పదం ఇక తనకు వినపడ కూడదు అంటూ మండిపడ్డారని తెలుస్తోంది.

  ఇప్పటికే చాలా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేక ఎదుర్కోవాలసి వస్తోంది. గడప గడపకు పేరుతో జనంలోకి వెళ్తే.. చాలా చోట్ల నిరసనలు కనిబిస్తున్నాయి. ఇంటికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంపు, పన్నుల విషయంలో నిలదీస్తున్నారు. అలాగే రోడ్లు ఏవని.. ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మాట దాటేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

  పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీలో జరిగిన ఒక ఘటన ఆసక్తిగా మారింది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర మూడవ వార్డు అయిన గుమడలో అధికారులతో పర్యటిస్తున్నారు. అలా ఒక ఇంటికి వెళ్లిన రాజన్నదొర ఆ ఇంట్లో మహిళను మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీకు పథకాలు ఎవరిస్తున్నారో తెలుసా అని అడిగారు. వెంటనే ఆ మహిళ నాకు పథకాలు వాలంటీర్ ఇస్తున్నారు అని సమాధానం ఇచ్చింది.. దీంతో డిప్యూటీ సిఎం రాజన్నదొరకి పట్టరాని కోపం వచ్చింది.

  ఇదీ చదవండి : మంత్రి రాసలీలకు ఇదిగో ఫ్రూఫ్.. ఆడియో రిలీజ్ చేసిన టీడీపీ.. వాయిస్ ఎవరిది..?

  ఆ మహిళ సమాధానం విన్నవెంటనే.. ఆయన ఆవేశంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న మునిసిపల్ కమీషనర్, సచివాలయం సిబ్బందిని పిలిచి వారి పై కూడా తీవ్రంగా మండిపడ్డారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలం శివరాంపురం వెళ్ళినప్పుడు కూడా అక్కడివారు కూడా పథకాలు ఇస్తుంది వాలంటీర్ అని చెప్తున్నారు. ఇలా మరోసారి వాలంటీర్ పేరు ఎవరయినా చెప్తే ఎంపిడిఓ, మునిసిపల్ కమీషనర్లు సస్పెండ్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు. అక్కడితోనే ఆయన ఆగలేదు.. మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తావన కూడా తెచ్చారంట..

  ఇదీ చదవండి : రాత్రికి రాత్రే కోటేశ్వరుడైతే..? నీటికోసం వెళ్లిన గొర్రెల కాపరికి ఏం దొరికిందో చూడండి..

  సీఎంగా చంద్రబాబు టైంలో పథకాలు ఎవరిచ్చారు అంటే చంద్రన్న ఇచ్చారని చెప్పేవారని.. కానీ సీఎం జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా..? ఆ పథకాలను వాలంటీరే ఇస్తున్నప్పుడు జనాల్లో ఉండడం ఏంటి.. సీఎం పేరు ఎందుకు వినిపించడం లేదని ఆయన మండిపడ్డారు. ఇదేం పద్ధతి.. ఇది కరెక్ట్ కాదు అని శివలెత్తారు.. ఈ ఘటనతో వెంటనే కార్యక్రమం ముగించి ఇదే అంశంపై మధ్యాహ్నం అధికారులతో అత్యవసర సమావేశం పెట్టారు.. ఆ సమావేశంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది, మండల ఆఫీస్ సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు.. అక్కడ కూడా వాలంటీర్లపై మండిపడ్డారు. మీరు ప్రజల వద్ద మంచిమార్కులు కొట్టేయడానికి జగనన్న పేరు చెప్పకుండా మీరు హైలైట్ అవుతున్నారని, అలా కుదరదని.. అలా జరిగితే వాలంటీర్లుతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vizianagaram, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు