Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH DEPUTY CM DHARMANA KRISHNA DAS BET TO OPPOSITION PARTIES IF CM JAGAN NOT WILL ASSETS WILL GIVE NGS

AP Minster: మరోసారి గెలిచేది ఆయనే.. కాకపోతే ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తా.. ఎవరైనా బెట్ కడతరా..? మంత్రి ఛాలెంజ్

డిప్యూటీ సీఎం ఛాలెంజ్

డిప్యూటీ సీఎం ఛాలెంజ్

AP Minster: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఛాలెంజ్ సంచలనంగా మారింది. ఏకంగా దమ్ముంటే ఎవరైనా బెట్ కట్టండి అని ఛాలెంజ్ చేస్తున్నారు. అది కూడా ఆస్తి మొస్తం రాసి ఇస్తాను అంటున్నారు. ఇంతకీ ఆయన ఎందుకా బెట్ కట్టారు.. ఏం బెట్ కట్టారు..?

    AP Minster Bet:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికలు తప్పవంటూ టీడీపీ (TDP) అప్పుడే అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యింది. పొత్తుల కోసం పావులు కూడా కదుపుతోంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయితే.. ఆవిర్భావ సభతోనే.. సమర శంఖం పూరించారు. పొత్తులకు సిద్ధం అంటూ టీడీపీని ఆశల పల్లకిలో పెట్టారు. బీజేపీ (BJP)తో కలిసే ఎన్నికలకు వెళ్తామంటూ.. స్పష్టం చేశారు. ఇక బీజేపీ సైతం రాయలసీ పై ప్రత్యేక ఫోకస్ చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు నెగ్గేలా వ్యూహాలు రచిస్తోంది. రోడ్ మ్యాప్ తో రెడీ అవుతోంది. ఇక అధికార పార్టీ సైతం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన అధినేత జగన్.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రజల మధ్యలోనే ఉండాలని.. లేని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇలా అన్ని పార్టీలు సమరానికి సై అంటుంటే.. డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్  (Darmana Krishan Das) సంచలన వ్యాఖ్యలు చేశారు..

    ఓ వైపు అధినేత, సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాలనకు వంద మార్కులు వేశారు. ప్రజా ఆకర్షణ ఉన్న ఏకైక సీఎం అంటూ ప్రశంసించారు. సంక్షేమ పాలనతో జగన్ తనదైన ముద్ర వేశారన్నారు. అందుకే దివంగత వైఎస్ఆర్ లాగే.. జగన్ సైతం జన నేతగా గుర్తింపు పొందరని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారన్నారు. జగన్ ఉన్న జనాకర్షణ చూసే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం జగన్ పాలన ప్రజలకు నచ్చబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ జగనే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఒకవేళ రెండోసారి జగన్ సీఎం కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. ఎవరైనా పందానికి రెడీయా అంటూ ఛాలెంజ్ చేశారు.

    ఇదీ చదవండి : సామాజిక వర్గాల వారిగా జాబితా ఖరారు.. ఏపీలో కొత్త మంత్రులు వీరే..

    నిజంగా ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి.. సవాల్ విసురుతున్నాను అన్నారు. టీడీపీ వాళ్లకు గెలుస్తామని నమ్మకం ఉంటే.. బెట్ కట్టండి అని ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో.. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని.. రారని తేల్చి చెప్పారు. అతనికి అతనే సాటి అని కామెంట్ చేశారు. వచ్చేసారి కూడా జగన్ సీఎం అవుతారని కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. కావాలంటే పందెం కాస్తా..టీడీపీ నేతలు కూడా రావొచ్చని అన్నారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆస్తి మొత్తం రాసిస్తామన్న సవాల్ పై ఇప్పటి వరకు అయితే టీడీపీ నేతలు స్పందించలేదు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు