హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tragedy: ఆమె లేని నేను లేను.. సారీ నాన్నా.. క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. ఏం జరిగిందంటే?

Tragedy: ఆమె లేని నేను లేను.. సారీ నాన్నా.. క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tragedy: డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుమారుడు.. మంచి భవిష్యత్తు ఉందని తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని వేధించింది. ఆమె లేని జీవితం నా కొద్దు అంటూ.. క్షమించండి నాన్నా అంటూ.. సుసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుమారుడు..

ఇంకా చదవండి ...

Tragedy: బంగారు భవిష్యుత్తు ఉన్న యువత.. తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకు నూరేళ్ల జీవితాతన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. కన్నవారికి కన్నీరు మిగులుస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువమంది యువతి, యువకులే ఉంటున్నారు. అందులో కూడా ఎక్కువంది విద్యార్థులే.. అందరివీ వేరువేరు కారణాలు కావొచ్చు.. కానీ వాటికి ముగింపు మాత్రం ఆత్మహత్యే (Suicide) అనుకుంటున్నారు. చదువు ఒత్తిడి అని కొందరు.. పెద్దలు మందలించారని మరికొందరు.. ప్రేమ విఫలమైందని ఇంకొందరు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని.. ఇలా వివిధ కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవితం తనకు వద్దు అనుకున్నాడు.. అనుక్షణం ఆమెనే గుర్తు చేసుకుంటూ మానసిక వేధన అనుభవించిన ఆ కుర్రాడు. చివరకి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివస్తాడు అనుకున్న ఎదిగిన కొడుకు మరణంతో ఆ కుటుంబలో పెను విషాదం నెలకొంది. ఈ ఘటన కర్నూలు జిల్లా (Kurnool) లో చోటుచేసుకుంది.

నాన్నా.. ఐ యామ్‌ సారీ (I am Sorry) అంటూ సుసైడ్‌ నోట్‌ (Suicide) రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం (Kodumuru) బి. అ్రగహారం గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర, వసుందర దంపతులకు ఇద్దరు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు 22 ఏళ్ల శివప్రసాద్‌ కోడుమూరులో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ (Degree Final Year) చదవుతున్నాడు. రామాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అదే కాలేజీలో డిగ్రీ చదువుతోంది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని..ఇద్దరు బయట వేరేచోటకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించారు. అలానే ఇద్దరు కలిసి ఇల్లు వదిలి పారిపోయారు. ఈ విషయం ఇరుకుటుంబాల వారికి తెలియడంతో వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి వెనక్కి తీసుకొచ్చారు. పెద్దల ముందు పంచాయితీ పెట్టి.. ఇంకా చదువుకుంటున్నారని.. అలాగే అమ్మాయి మైనర్‌ కావడంతో.. ఇద్దరిని కొన్ని రోజులు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. మైనార్టీ తీరిన తర్వాత లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక.. అప్పుడు కూడా వీరిద్దరి ఆలోచన ఇలానే ఉంటే పెళ్లిచేయాలని ఇరుకుటుంబాలు పెద్దల ముందు అంగీకారణానికి వచ్చాయి.

ఇదీ చదవండి : వీడు మాములోడి కాదు.. 25 ఏళ్లకే DRDO శాస్త్రవేత్తనంటూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలకే కుచ్చుటోపీ.. ఏం చేశాడంటే

ఆ వెంటనే ఎవరింటికి వాళ్లను తీసుకెళ్లారు. అప్పటివరకు అంతా సాఫీగానే సాగింది అనుకునేలోపే విషాదం వెంటాడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారో ఏమో కానీ.. సోమవారం రోజు అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం మంగళవారం శివప్రసాద్‌కు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఇదీ చదవండి : గన్ మెన్ లేకుండానే తిరుగుతున్నా.. రెండు రోజుల్లో సంచలనాలు బటయపెడతానన్న పయ్యావుల

తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి.. భూమ్మీద లేదని తెలిసి కుంగిపోయాడు. ఇంక ఎవరి కోసం బతకాలి… ఎందుకు బతకాలి అంటూ సుసైడ్‌ నోట్‌ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. సుసైడ్‌ నోట్‌లో… సారీ నాన్నా.. నాకు బతకాలని అస్సలు లేదు.. మీకు తెలుసు నేను ఒక యువతిని ప్రేమించానని.. ఆమె ఎక్కడున్నా బాగుండాలనుకుంటున్నా అందుకే ఆమె లేకుండా తాను ఉండలేను అని చెబుతూ ఆత్మహత్య చేసకున్నాడు.

ఇదీ చదవండి : 8 నెలల్లో భారతవర్ష నవల పూర్తి.. పూలబాల ప్రపంచ రికార్డ్.. ప్రత్యేకత ఏంటంటే?

తాను సుసైడ్‌ చేసుకున్న విషయం తెలిశాక ఇక తాను బతకలేను అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనుల కోసం వెళ్లిన శివప్రసాద్‌ అమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి.. ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి గుండెలవిసేలా రోధించింది. ఆవిడ కేకలకు చుట్టు పక్కల వారంతా వచ్చి.. ఉరికి వేలాడుతున్న శివప్రసాద్‌ను చూసి…అతని మృతదేహాన్ని కిందకు దించారు. శివప్రసాద్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Lovers suicide

ఉత్తమ కథలు